మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
x

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ (59) శనివారం కన్నుమూశారు.


ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ (59) శనివారం కన్నుమూశారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. అయితే హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే రమేశ్ రాథోడ్ మృతి చెందారు.

శుక్రవారం అర్ధరాత్రి రమేష్ రాథోడ్ ఉట్నూరులోని ఆయన నివాసంలో అస్వస్థతకి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద ఆఖరి శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఉట్నూరుకి తరలించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.


కాగా, రమేష్ 1999లో టీడీపీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో కూడా అదే పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి 2018లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జూన్ 2021 లో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు.

రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Read More
Next Story