Manchu Manoj and Mounika|మనోజ్ తర్వాత మౌనికదేనా ?
మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లే భూమ ఇంట్లో కూడా గొడవలున్నాయి
మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ఏ స్ధాయిలో రచ్చకెక్కాయో అందరు చూస్తున్నదే. బహుశా ఆస్తులు ఎక్కువైపోయిన కుటుంబాల్లో పంపకాల విషయంలో చాలా ఇళ్ళల్లో ఇలాగే గొడవలు అవుతాయేమో. ఇంట్లో పిల్లల మీద పెద్దవాళ్ళ అదుపు ఉంటే గొడవలు రోడ్డునపడకుండా నాలుగు గోడలమధ్య సర్దుబాటు చేసుకుంటారు. అలాకుదరని కుటుంబాల్లో వివాదాలు మంచు ఇంట్లో పడినట్లు రోడ్డునపడక తప్పదు.(Manchu Vishnu) మంచువిష్ణు-మంచుమనోజ్(Manchu Manoj) మధ్య ఎప్పటినుండో వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దానికి కంటిన్యుయేషన్ గానే తండ్రి మోహన్ బాబు(Mohan Babu), కొడుకు మనోజ్ మధ్య గొడవలు పెరిగిపోయి రోడ్డునపడి చివరకు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదులు దాకా చేరుకుంది.
ఇపుడు విషయం ఏమిటంటే మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లే భూమ ఇంట్లో కూడా గొడవలున్నాయి. భూమా నాగిరెడ్డి(Bhuma Nagireddy), శోభా నాగిరెడ్డికి(Sobha Nagireddy) ముగ్గురు సంతానం. మొదటి సంతానం భూమా అఖిలప్రియ(Akhila Priya), రెండోసంతానం భూమా మౌనిక(Mounika), మూడో సంతానం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. తల్లి, దండ్రులు ఇద్దరు చనిపోవటంతో పెద్దమ్మాయి అఖిలదే పెత్తనం అయ్యింది. తల్లి చనిపోవటంతో ఎంఎల్ఏ అయిన అఖిల తండ్రి పోవటంతో ఏకంగా మంత్రి అయిపోయింది. అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్న చెల్లెలు, తమ్ముడు ఇపుడు పెద్దవాళ్ళు అయిపోయారు. తల్లి, దండ్రులు సంపాదించిన ఆస్తులను పంపకాలు చేయమని చెల్లెలు అడుగుతుంటే అఖిల కాదని అంటోందని సమాచారం. ఎప్పుడు ఆస్తుల పంపిణీ ప్రస్తావన వచ్చినా ఇపుడు కాదు మళ్ళీ చూద్దామని అఖిల వాయిదాలు వేస్తోందని తెలుస్తోంది. ఇదేవిషయంలో అక్క-చెల్లెలు మధ్య కూడా చాలా గొడవలు అయ్యాయని సమాచారం.
అయితే ఉమ్మడి ఆస్తిలో చాలావరకు అఖిల తనిష్టం వచ్చినట్లు వాడుకుంటోందని చెల్లెలు మౌనికకు తెలిసిందట. దాంతో ఆస్తుల పంపిణీ విషయమై ఇపుడు మౌనిక గట్టిగా ఉందని అంటున్నారు. ఆస్తుల పంపిణీ విషయంలో అక్కతో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఆస్తుల పంపిణీ విషయంలో ఇటు చెల్లెలుతో తగాదాలు ఉన్నట్లే అటు టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి(TDP leader AV SubbaReddy)తో కూడా అఖిలకు గొడవలు అవుతున్నాయి. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటినీ ఏవీపైన ఉంచాడదన్నది అఖిల అనుమనం. ఇదేవిషయమై గతంలో ఏవీతో మాజీమంత్రికి గొడవ అయిన విషయం అందరికీ తెలిసిందే. భూమా సంపాదించిన ఆస్తులతో తనకేమీ సంబంధంలేదని అప్పట్లోనే ఏవీ చెప్పినా అఖిలకు నమ్మలేదు. అందుకనే ఏవీతో ఆస్తుల విషయంలో అఖిల గొడవలు పడుతోంది.
ఈనేపధ్యంలోనే చెల్లెలుకు ఆస్తుల పంపకాలు చేయటాన్ని అఖిల ఇష్టపడటంలేదు. చెల్లెలుకు ఆస్తులు ఇచ్చేఉద్దేశ్యం అక్కకి ఉందో లేదో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకనే తనకు రావాల్సిన ఆస్తి వాటాకోసం మౌనిక న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచు ఇంట్లో గొడవలు లేకపోతే బహుశా ఈపాటికే అక్కతో ఆస్తుల విషయంలో తాడోపేడో మౌనిక తేల్చుకునేదేనేమో. అత్తింట్లోను గొడవలు, పుట్టింట్లోను గొడవలుంటే మానసికంగా నలిగిపోతామని మౌనిక ఇపుడు సంయమనం పాటిస్తున్నట్లుంది. అత్తింట్లో వ్యవహారాలు సర్దుబాటు అయిన వెంటనే పుట్టింటి ఆస్తుల విషయాన్ని మౌనిక లేవదీయటానికి సిద్ధంగా ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. చెల్లెలు ప్రయత్నాలు సరే మరి అక్కడ అందుకు ఒప్పుకుంటుందా ? ఎట్టిపరిస్ధితుల్లోను అంగీకరించదు. అందుకనే మనోజ్ వివాదం తర్వాత మౌనిక ఇంటివివాదం రచ్చకెక్కటం ఖాయమనే జోస్యాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.