Akbaruddi Owaisi | ‘బీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేయండి’
x

Akbaruddi Owaisi | ‘బీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేయండి’

ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తోంద ప్రజల కోసమా? ఒక కుటుంబం కోసమా? అని నిలదీశారు. తామైతే ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసం అసెంబ్లీకి వస్తున్నామని, కానీ బీఆర్ఎస్ నేతలు తీరుతెన్నులు చూస్తే అలా కనిపించడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారు కేవలం ఒక కుటుంబం కోసమే పోరాడుతున్నారని అన్నారు.

‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి....? ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయి. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చారు. 10ఏళ్ళు తెలంగాణలో కచరా గవర్నమెంట్ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చారా...? లేక కేసీఆర్ కుటుంబం కోసం వచ్చారా...? అవసమైతే సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చెయ్యండి. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా...? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలి’’ అని ప్రశ్నించారు.

Read More
Next Story