హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎందే గెలుపు
x

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎందే గెలుపు

బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు రాగా ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హాసన్‌కు 63 ఓట్లు వచ్చాయి.


హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ ఊహించిన ఫలితమే వెల్లడయింది. ఎంఐఎంపార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ పార్టీలు మాత్రమే పోటీ చేశాయి. ఎన్నికల్లో మొత్తం 88ఓట్లు నమోదు కాగా వాటిలో బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు రాగా ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హాసన్‌కు 63 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కేవలం పోటీ జరగాలన్న ఉద్దేశంతోనే బీజేపీ బరిలోకి దిగింది.

ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఉన్న ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అత్యధిక ఓట్లు ఎంఐఎం పార్టీకే ఉండటంతో ఈ ఎన్నికల పోలింగ్ లాంఛన ప్రాయంగా ఉండనున్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎంకు మొత్తం 49 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 25 ఓట్లే ఉన్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంఐఎంకు ఉండటంతో ఆ పార్టీ ఓట్లు కూడా ఎంఐఎంకే పడ్డాయి.

Read More
Next Story