మత్తులో దొరికిపోయిన మందుబాబులు
x
Foreign liquor

మత్తులో దొరికిపోయిన మందుబాబులు

ఫుల్లుగా మందుకొట్టేసి విమానం ఎక్కి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులకు దొరికిపోయారు మందుబాబులు.


ఫుల్లుగా మందుకొట్టేసి విమానం ఎక్కి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులకు దొరికిపోయారు మందుబాబులు. విషయం ఏమిటంటే వ్యాపార ప్రోత్సాహకంలో భాగంగా సుమారు వందమందికి పైగా హైదరాబాద్ నుండి గోవాకు వెళ్ళారు. మూడురోజులు గోవాలోనే ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తిరిగి వచ్చేటపుడు ఉత్తినే రాకుండా తమతో పాటు మోయలేనన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్ళను పట్టుకొచ్చారు. దాంతో విషయం ముందే ఉప్పందటంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు తమ సిబ్బందితో శంషాబాద్ విమానాశ్రయంలో కాపు కాసి అందరినీ పట్టేసుకున్నారు.

గోవాలో మస్తు ఎంజాయ్ చేసింది సరిపోనట్లుగా దాదాపు 90 మంది ఫారిన్ లిక్కర్ బాటిళ్ళను కొనుక్కున్నారు. వాటన్నింటినీ తమ బ్యాగుల్లో సర్దుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ 90 మంది కూడా తమ కెపాసిటికి తగ్గట్లుగా అంటే నాలుగు బాటిళ్ళ నుండి 30 బాటిళ్ళవరకు బ్యాగుల్లో సర్దుకున్నారు. హైదరాబాద్ అంతా కరువు ప్రాంతం అన్నట్లుగా వ్యాపారస్తులు రెచ్చిపోయారు. గోవాలో తాగింది సరిపోనట్లుగా తిరుగుప్రయాణంలో హైదరాబాద్ కు కూడా ఫారిన్ సరుకును మోసుకొచ్చారు.

వ్యాపారస్తులు అలా గోవాలో బయలుదేరేరో లేదో వెంటనే హైదరాబాద్ లోని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులకు సమాచారం వచ్చేసింది. వ్యాపారస్తులు మూడు విమానాల్లో గోవా నుండి హైదరాబాద్ కు బయలుదేరినట్లుగా పక్కా సమాచారం అందించారు. అందరూ నాన్ డ్యూటీ పెయిడ్ ఫారిన్ లిక్కర్ దండిగా మోసుకొస్తున్నట్లు కూడా ఎవరో సమాచారం ఇచ్చారు. దాంతో గోవాలో విమానాలు బయలుదేరిన సమయాన్ని నిర్ధారించుకున్న ఇక్కడ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు సిబ్బందిని శంషాబాద్ విమానాశ్రయంలో మోహరించారు. సమాచారం అందినట్లుగానే బుధవారం రాత్రి 10 గంటల నుండి గురువారం తెల్లవారి 2 గంటల వరకు మూడు విమానాల్లో 90 మంది దిగారు. దిగిన వారిని దిగినట్లుగా ఎక్సైజ్ అధికారులు పట్టుకుని లగేజీని చెక్ చేసినపుడు 415 నాన్ డ్యూటీ పెయిడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్ళు దొరికాయి.

మందుబాబులు తెచ్చుకున్న ఫారిన్ బాటిళ్ళ ఖరీదు 12 లక్షల రూపాయలుంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. 12 మంది మీద ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదుచేశారు. ఏదో తాగటానికి ఒకటో లేకపోతే రెండు బాటిళ్ళో అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ ఇక్కడ గోవానుండి తిరిగొచ్చినవారంతా తలా మూడు బాటిళ్ళ నుండి 30 బాటిళ్ళు తెచ్చుకుంటే అధికారులు వదిలిపెడతారా ? అందులోను గోవాలో నుండి బయలుదేరిన వాళ్ళల్లోనే ఎవరూ హైదరాబాద్ ఎక్సైజ్ డిపార్ట్ మెంటుకు పక్కాగా సమాచారం ఇచ్చారు. గోవాలో ఫుల్లుగా తాగి విమానం ఎక్కిన మందుబాబులకు ఆ కైపు దిగేంతలోనే హైదరాబాద్ కు చేరుకోవటం వెంటనే ఎక్సైజ్ అధికారులకు దొరికిపోవటంతో ఎక్కిన మత్తంతా ఒక్కసారిగా దిగిపోయుంటుంది.

Read More
Next Story