బయట పడ్డ పంకజ్ పిల్లలకోసం వెళ్లి మంటల్లో చిక్కుకున్నాడు...
x

బయట పడ్డ పంకజ్ పిల్లలకోసం వెళ్లి మంటల్లో చిక్కుకున్నాడు...

గుల్జార్ హౌస్ హృదయాన్ని పిండే విషాదం... ఆ కుటుంబానిది.



మంటల, దట్టంగా అలుముకుంటున్న పొగ నుంచి అతికష్టం మీద బయటపడినా, పిల్లల, భార్య ఆర్తనాదాలు విని పంకజ్ లోపలికి పరిగెత్తాడు, మళ్లీ రాలేదు....

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే...


*ఉదయం 6.16 గంటలకు చార్మినార్, గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మంటలు చెలరేగాయి. *మొఘల్‌పురా వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

*షార్ట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే, కచ్చితమయిన కారణం ఇంకా తెలియడం లేదు.

*ప్రమాదం జరిగిన భవనంలో గ్రౌండ్ + 2 అంతస్తులు ఉన్నాయి. కింది అంతస్తులో మంటలు చెలరేగి.. పై అంతస్తులకు వ్యాపించాయి.

* మంటలు మొదట కృష్ణా పరల్స్ లో లేచాయని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ వై. నాగిరెడ్డి చెప్పారు. దీనికి షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతూ ఈ మంటలు వెన్వెంటనే సంసారాలు ఉంటున్న పై ఫ్లోర్స్ కు వ్యాపించాయి. ఫైర్ డిపార్టెమెంట్ కు ఉ. 6.16 కు తొలికాల్ వచ్చింది. 6.17కు 11 ఫైర్ ఇంజన్లను, సిబ్బంది ప్రమాదస్థలానికి పంపించారు. పొగలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది ఆక్సిజన్ మాస్కులతో రంగంలోకి దిగారని ఆయన చెప్పారు.

ఆగ్నిమాపక దళం రంగంలోకి దిగిన టైమ్ లైన్

Fire call received at 06:16 Hrs.

Fire tenders moved to fire ground immediately as follows.

06:17 Hrs Moghalpura

06:26 Hrs High court

06:28 Gowliguda Bowser

06:56 Salary jung Musium

07:01 Hrs Chendulalbaradari

07:25 Hrs Hazmath LB Nagar

07:38 Hrs Gandhi out post

07:41 Hrs Rescue Tender Hydraulic plot farm

07:44 Hrs Rajendra Nagar

07:49 Hrs BSL Secreteriat

07:50 Hrs Langer House.

:Y. Nagi Reddy, IPS, DG Fire Services

* అగ్ని ప్రమాదం సరిగ్గా ఎక్కడమొదలయింది. ఎలా మొదలయింది అనేవి ఇంకా కచ్చితంగా తేలాల్సి ఉంది. అలాగే ఆస్తినష్టం కూడా ఇంకా తెలియడం లేదు. ప్రమాదంలో ఎంత చిక్కకున్నారనే దానికి కూడా సరైన సమాచారం అందడం లేదు. దాదాపు 60 మంది దాకా చిక్కుకున్నారని ఒక అధికారి ఫెడరల్ తెలంగాణ కు చెప్పారు. వారందరిని కాపాడినట్లు కూడా ఆయన చెప్పారు.

* ప్రమాదం జరిగిన ఇంటికి, ఈ ప్రాంతంలోని అన్ని బిల్డింగులుకు ఉన్నట్లే ఒకే ఒక ఇరుకైన స్టెయిర కేస్ ఉంది. అదొక గుహలోకి వెళ్లున్నట్లుంది. ఒక్కొసారి ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే పై ఫ్లోర్లకి వెళ్లగలరు రాగలరు. దీనివల్ల ఫైర్ సిబ్బంది ఈ మార్గం పైకి చేరుకోవడం కష్టమయింది. ఉదయం తొమ్మది గంటలకల్లా మంటలు అదుపులోకి వచ్చాయి. కాని అప్పటికే పొగలో ఉపిరాడక చాలామంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు.

* ప్రమాదంలో 17 మంది చనిపోతే, మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.

*పిల్లలకు వేసవి సెలవులు కావడంతో బెంగాల్ నుంచి చుట్టాల ఇంటికి వచ్చిన వారు కూడా మరణించినట్లు చెప్పారు. మరణించిన వారంతా ఒకే కుటుంబాని(మోదీ కుటుంబం)కి చెందిన వారని తెలుస్తున్నది.

* ఉదయం 6.10కి పంకజ్ మోదీనుంచి ప్రమాదం గురించి తనకు ఫోన్ వచ్చిందని సయ్యద్ ఇక్బాల్ అనే గాజులమ్మే వ్యక్తి మీడియా కు చెప్పాడు. ఇక్బాల్ కు మోదీ కుటుంబం బాగా తెలుసు. అందుకే ఫోన్ చేసి తామంతా మంటల్లో చిక్కుకున్నామని, రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు.

*ఇక్బాలు అంబులెన్స్ ను పిలించారు.ఫైర్ వాళ్లకి ఫోన్ చేశారు. వాళ్ళంతా అక్కడకు చేరుకున్నారు.

*ఏదో విధంగా మంటలనుంచి పంకజ్ (38) బయటకు వచ్చాడు. ఏదైన సహాయం అందుతుందేమోనని చూశారు. ఈలోపు భార్యా పిల్లల ఆర్తనాదాలు వినిపించాయి. వాళ్లని కాపాడేందుకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేకపోయాడు. అలా ఆయన మంటలకు ఆహుతి అయ్యాడని ఇక్బాల్ చెప్పాడు.

* ఈ లోపు దిల్ బాగ్ సింగ్ అనే వ్యాపారి అక్కడికి వచ్చాడు. అతను ముత్యాలకోసం వస్తుంటాడు. ఆయన వెంటనే పంకజ్ సోదరుడు గోవిందాకు ఫోన్ చేశారు. లోపలినుంచి బాధకారణమయి సమాధానం వచ్చింది. తమ్ముడు పోయారు, చెల్లెళ్లు పోయారు... అని

* ప్రమాదం జరిగే సమయానికి ఇంకా అంతా నిద్రపోతూనే ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా పొగ అలుముకోవడంతో పలువురు స్పృహ కోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్​గూడ, డీఆర్​డీవో ఆసుపత్రులకు తరలించారు.

* 11 ఫైర్ వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పే ఆపరేషన్లో పాల్గొన్నారు.

* చనిపోయిన వారిలో 8 మంది పిల్లలు. అందులో ప్రధాన్ వయసు 1.5 సంవత్సరాలు. మిగతావారంతా 2-4 సంవత్సరాలు వయసు ఉన్నారు.

* మంటలను ఆర్పడానికి మొత్తం 2 గంటల సమయం పట్టిందని అధికారులు చెప్పారు.

*పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద స్థలానికి వెనకబడిన కులాల సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని ప్రమాదం గురించి వాకబు చేశారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

* గుల్జార్ హౌస్‌ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం పై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థికసాయం ప్రకటించి అండగా నిలవాలని ప్రభుత్వానికి సూచించారు.

* గుల్జార్‌ హౌస్‌ లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

* చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తర్వాత డెప్యూటీ చీఫ్ వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహాతో కలసి భట్టి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి చేరకున్నారు.

*అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్నిప్రమాదాన్ని, సహాయకచర్యలను సమీక్షించారు.

* అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అగ్ని మాపక సిబ్బంది దగ్గిర ఆధునికి సాంకేతి పరికరాలు లేవని వ్యాఖ్యానించారు.చివరకు ఆగ్ని మాస్క్ లు కూడా లేవన్నారు.

* కిషన్ రెడ్డి కామెంట్ ను ఫైర్ సర్వీసెస్ డిజి వై నాగిరెడ్డి తో పాటు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఖండించారు. కిషన్ రెడ్డికి వాస్తవాలు తెలియని ప్రభాకర్ అన్నారు.









Read More
Next Story