
నాలుగు రోజుల కస్టడీకి అంబేద్కర్
మరింత సమాచారం కోసం అదుపులో తీసుకున్న ఎసిబి అధికారులు
రిమాండ్ లో ఉన్న విద్యుత్ శాఖ మాజీ ఎడీఈ అంబేద్కర్ ను నాలుగు రోజుల కస్టడీకి ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అంబేద్కర్ రిమాండ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉన్నారు. అతడిని కస్టడీకి అప్పగించాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అతన్ని నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
గత నెల 16 వ తేదీన ఎసిబి అధికారులు సోదా చేయగా హైదరాబాద్ మణికొండ ఎడిఈ అధికారిగా పని చేస్తున్నఅంబేద్కర్ అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. 200 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు.అంబేద్కర్ బినామి సతీష్ ఇంట 2.58 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. విద్యుత్ శాఖ చరిత్రలోఇంత పెద్ద స్థాయిలో అక్రమాస్తులు లభించడం ఇదే ప్రథమం.
అంబేద్కర్ పై ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అతన్ని విధుల నుంచి తొలగించింది.