తెలంగాణ అమ్మాయికి సివిల్స్ మూడో ర్యాంకు.. మొదటి ప్రయత్నంలోనే
x

తెలంగాణ అమ్మాయికి సివిల్స్ మూడో ర్యాంకు.. మొదటి ప్రయత్నంలోనే

UPSC నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో మూడవ ర్యాంకు సాధించిన అనన్య పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మొదటి రెండు ర్యాంకులు పురుషుల ఖాతాలోకి వెళ్లగా.. తెలంగాణకి చెందిన దోనూరి అనన్య రెడ్డి 3 వ ర్యాంక్ సాధించి, మహిళా అభ్యర్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది.

అనన్య రెడ్డి తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరి సురేష్ రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె. ఢిల్లీ యూనివర్సిటీలోని మిరాండా హౌస్ లో చదువుకున్న అనన్య సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ఆమెతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 30 మంది అభ్యర్థులు (లిస్ట్ కింద ఉంది) సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.


ఇక మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో మూడవ ర్యాంకు సాధించిన అనన్య పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తన సొంత జిల్లాకి చెందిన అనన్య రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు కూడా రేవంత్ అభినందనలు తెలిపారు.


సివిల్స్ లో టాప్ 3 సాధించడంపై అనన్య స్పందించారు. "ఢిల్లీ యూనివర్సిటీ కి అనుబంధ కాలేజీ మిరాండా హౌస్ లో జియోగ్రఫీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. చైల్డ్ హుడ్ నుండే సోషల్ సర్వీస్ చేయాలనే తపన నాలో ఉండేది. దీంతో డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ పై ఫోకస్ పెట్టాను. రోజుకి 12 నుండి 14 గంటల పాటు కస్టపడి చదివాను. ఆంత్రోపాలజి ఆప్షనల్ సబ్జెక్టు గా తీసుకున్నాను. దీనికోసం హైదరాబాద్ లోనే కోచింగ్ తీసుకుని టైం టేబుల్ ప్రకారం చదువుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు వస్తుంది అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది" అని అనన్య తెలిపారు.


కాగా, సివిల్స్ పరీక్షల్లో మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ సెలక్ట్ చేసింది. జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 347, ఈడ‌బ్ల్యూఎస్ 115, ఓబీసీ 303, ఎస్సీ కేట‌గిరి కింద 165, ఎస్టీ కేట‌గిరి కింద 86 మందిని ఎంపిక చేశారు. UPSC ప్రిలిమ్స్, మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు.

అధికారిక వివరాల ప్రకారం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం 180 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కోసం 37 మంది, ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ 'A' కోసం 613 మంది, గ్రూప్ 'B' కోసం 113 మంది సెలెక్ట్ అయ్యారు. రికమండ్ చేయబడిన 355 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ప్రొవిజనల్ లో ఉంచారు.

టాప్ 10 అభ్యర్థుల లిస్ట్

ఆదిత్య శ్రీవాస్తవ -1

అనిమేష్ ప్రధాన్ -2

దోనూరి అనన్య రెడ్డి -3

PK సిద్ధార్థ్ రామ్ కుమార్ -4

రుహాని -5

సృష్టి దాబాస్ -6

అన్మోల్ రాథోర్ -7

ఆశిష్ కుమార్ -8

నౌషీన్ -9

ఐశ్వర్యం ప్రజాప్ -10



ఫలితాల్లో ర్యాంక్ సాధించిన తెలుగు అభ్యర్థులు :


అనన్య రెడ్డి -3

నందల సాయికిరణ్ -27

మేరుగు కౌశిక్ -82

పెంకీసు ధీరజ్ రెడ్డి -173

జి.అక్షయ్ దీపక్ -196

గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ -198

నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి -382

బన్న వెంకటేశ్ -467

కడుమూరి హరిప్రసాద్ రాజు -475

పూల ధనూష్ -480

కె.శ్రీనివాసులు -526

నెల్లూరు సాయితేజ -558

కిరణ్ సాయింపు -568

మర్రిపాటి నాగభరత్ -580

పోతుపురెడ్డి భార్గవ్ -590

కె.అర్పిత -639

ఐశ్వర్య నెల్లిశ్యామల -649

సాక్షి కుమారి -679

చౌహాన్ రాజ్ కుమార్ -703

గాదె శ్వేత -711

వి.ధనుంజయ కుమార్ -810

లక్ష్మీ బానోతు -828

ఆదా సందీప్ కుమార్ -830

జె.రాహుల్ -873

హనిత వేములపాటి -887

కె. శశికాంత్ -891

కెసారపు మీన -899

రావూరి సాయి అలేఖ్య -938

గోవద నవ్యశ్రీ -995

Read More
Next Story