
ఎస్ఎల్‌బీసీలో పొంచి ఉన్న మరో ప్రమాదం!
నిమిషానికి 5వేల లీటర్లు నీరు ఊరుతోందని, మట్టి కూడా కూలుతోందని, ఈ రెండు కలిసి బురదలా మారి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని సహాయక బృందాలు చెప్తున్నాయి.
SLBC సొరంగంలో ప్రమాదం జరిగి 10 రోజులు ముగిశాయి. అందులో సహాయక చర్యలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక నిర్వహిస్తోంది. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం సరికొత్త సాంకేతికతలను కూడా వినియోగిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు ముగుస్తాయని సీఎం రేవంత్.. రెండు రోజుల క్రితమే చెప్పారు. ఇంతలోనే ఈ సహాయక చర్యల్లో ఆటంకాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సొరంగంలో మరో ప్రమాదం పొంచి ఉందని సహాయక బృందాలు చెప్తున్నాయి. ఈ ఆటంకాల వల్ల సహాయక చర్యలు ముందుకు సాగడం కష్టంగా మారిందని సమాచారం. దీంతో ఎస్ఎల్‌బీసీలో చేపట్టిన సహాచక చర్యలు ఆలస్యమవుతున్నాయి. ఈ ఆటంకం సహాయక బృందాలకు అతిపెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఎలాగైనా ఈ ఆటంకాన్ని అధిగమించాలని సహాయక బృందాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఆటంకాన్ని ఎలా అధిగమించాలి, సహాయక చర్యలను ఎలా ముందుకు కొనసాగించాలి అన్న అంశాలపై అధికారులు చర్చు చేస్తున్నారు.
ఒకవైపు ఆటంకం కలిగి సహాయక చర్యలు నెమ్మదించాయి. మరోవైపు కన్వీనర్ బెల్ట్ పునరుద్దరణ చర్యలు వేగంగా సాగుతున్నాయి. టీబీఎం మిషన్ కటింగ్ పనులను చివరి దశలో జరుగుతున్నాయి. మరోవైపు డీవాటరింగ్ పనులు కూడా వేగగా జరుగుతున్నాయి. నీటిని తొలగిస్తున్న కొద్దీ నీరు ఊరుతూనే ఉందని, ఇది సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఇప్పటి వరకు ఏడు అడుగుల లోతు తవ్వకాలు జరిపినా లోపల చిక్కుకున్న వారి మృతదేహాలు లభించలేదు.
అయితే రెస్క్యూ బృందాల ముందు ఉన్న అసలు ఛాలెంజ్.. ఊరుతున్న నీరే. తొలగిస్తున్న దానికన్నా వేగంగా నీరు వచ్చి చేరుతున్నట్లు తెలుస్తోంది. నిమిషానికి 5వేల లీటర్లు నీరు ఊరుతోందని, ఈ నీటి ఎద్దడితో మట్టి కూడా కూలుతోందని, ఈ రెండు కలిసి బురదలా మారి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని సహాయక బృందాలు చెప్తున్నాయి. మొండిగా ముందుకు వెళితే మరో ప్రమాదం తప్పదని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సహాయక చర్యల విషయంలో రెస్క్యూ బృందాలు సందిగ్దంలో పడ్డారు. సహాయక చర్యలను ఎలా ముందుకు కొనసాగించాలి? పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎలా తప్పించాలి? అన్న అంశాలపై అధికారులు, నిపుణులు చర్చలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.