కాళేశ్వరంపై మరో కుట్ర: హరీష్ రావు
x

కాళేశ్వరంపై మరో కుట్ర: హరీష్ రావు

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య విభేధాలే కారణం


కాళేశ్వరం మోటార్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఉన్న విభేధాల వల్ల మోటార్లను నాశనం చేసి బిఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీష్ రావు అన్నారు. మీలో మీరు చూసుకోండి కాళేశ్వరంపై బురదజల్లే రాజకీయాలు కాళేశ్వరంపై మరో కుట్ర: హరీష్ రావు మానుకోండి అని హరీష్ రావు సూచించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాను. ప్రాజెక్టు గేట్లు ఎత్తి సముద్రం పాలు చేయొద్దని వారం క్రితమే లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు’’ అని హరీష్ రావు అన్నారు.‘‘ కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. నీళ్లను సముద్రం పాలు చేస్తుంది. ప్రభుత్వానికి చేత కావడం లేదు’’ అని హరీష్ రావు అన్నారు. ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా నీళ్లను ఇస్తే మిడ్ మానేరు,అన్నపూర్ణ ప్రాజెక్టుల్లో నీళ్లు చేరతాయి అని హరీష్ రావు అన్నారు.

‘‘కాళేశ్వరం మోటార్లను ఆన్ అండ్ అన్ చేయడం వల్ల పనికి రాకుండా పోతాయి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడదని ఇప్పటికే బిహెచ్ఈఎల్ హెచ్చరికలు చేసినట్టు’’ హరీష్ రావు గుర్తు చేశారు. దేవాదులకు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల వరంగల్ కు నష్టం జరుగుతోందన్నారు. మోటార్లు కాలిపోతే ఆ నెపంతో బిఆర్ఎస్ పై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Read More
Next Story