తిరుమల లడ్డూ ప్రసాదంపై మరో వివాదం, గుట్కా ప్యాకెట్ ప్రత్యక్షం
x

తిరుమల లడ్డూ ప్రసాదంపై మరో వివాదం, గుట్కా ప్యాకెట్ ప్రత్యక్షం

తిరుమల లడ్డూ ప్రసాదంపై మరో వివాదం రాజుకుంది. జంతువుల కొవ్వు మాత్రమే కాదు గుట్కా ప్యాకెట్ కూడా వచ్చిందని వెల్లడైంది. లడ్డూ వివాదం తెలంగాణకు విస్తరిస్తోంది.


తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఘటన మరవక ముందే మరో ఘటన తాజాగా వెలుగుచూసింది.తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ వెలుగుచూడటంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో భక్తులున్నారు.


తిరుమల లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మావతి అనే భక్తురాలు తిరుమల స్వామివారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదంతో తిరిగి స్వస్థలానికి వచ్చారు. తాను తిరుమల నుంచి తెచ్చిన లడ్డూ ప్రసాదాన్ని పంచడానికి సిద్ధమవ్వగా గుట్కా ప్యాకెట్ ముక్క,పొగాకు ఆనవాళ్లు లభించాయని పద్మావతి ఆరోపించారు. ఖమ్మం రూరల్ మండలంలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉండే పద్మావతి తిరుమల నుంచి తీసుకువచ్చిన లడ్డూను తినేందుకు సిద్ధం కాగా గుట్కా ప్యాకెట్ దర్శనమివ్వడంతో షాక్ కు గురయ్యారు.

భక్తుల దిగ్భ్రాంతి
తాను సెప్టెంబర్ 19వతేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లు పద్మావతి చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పద్మావతి తన బంధువులు, ఇరుగుపొరుగు వారికి పంచడానికి లడ్డూను ముక్కలుగా చేసి చూడగా ప్రసాదం లోపల ఉన్న వస్తువులను వస్తువులను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.తిరుమల లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ కనిపించడంతో వెంకన్న భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు ఆలయ ప్రసాదాల పవిత్రతను దెబ్బతీస్తాయని పద్మావతి ఉద్ఘాటించారు.

తిరుమల ఘటన నేపథ్యంలో తెలంగాణలో తాజా ఆదేశాలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలోని అన్నీ దేవాలయాలకు విజయ బ్రాండ్ నెయ్యిని సరఫరా చేయాలని తెలంగాణ డెయిరీ యాజమాన్యానికి తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు. జైళ్లకు విజయ డెయిరీ పాలు, పాల పదార్థాలు అందించాలని ప్రభుత్వం కోరింది.





Read More
Next Story