హైదరాబాద్ లో మరో సైబర్ మోసం
x

హైదరాబాద్ లో మరో సైబర్ మోసం

వృద్దుడి సెల్ ఫోన్ అపహరించి బ్యాంకు ఖాతాను కొల్లగొట్టిన వైనం


హైదరాబాద్ లో మరో సైబర్ మోసం బయట పడింది. వృద్దుడే టార్గెట్ గా జరిగిన ఈ సైబర్ మోసంలో తొలుత సెల్ ఫోన్ అపహరించిన ముఠా తర్వాత అతడి బ్యాంకు ఖాతాను కొల్లగొట్టింది. హైదరాబాద్ కు చెందిన 68 ఏళ్ల వృద్దుడు ఉప్పల్ నుంచి ఆటోలో బయలుదేరాడు. వృద్దుడు దిగే సమయంలో డిజిటల్ పేమెంట్ చేయాలని ఆటో డ్రైవర్ కోరాడు. ఆటో డ్రైవర్ కు మరో ఇద్దరు సహకరించారు. డిజిటల్ పేమెంట్ కాగానే సైబర్ నేరగాళ్లు వృద్దుడి సెల్ ఫోన్ తస్కరించారు. ఇంటికి వెళ్లిన వృద్దుడు మరుసటి రోజు తన సెల్ ఫోన్ చెక్ చేసుకోగా కనిపించలేదు. మోసాన్ని గ్రహించిన వృద్దుడు తన బ్యాంకు ఖాతాను చెక్ చేసుకున్నాడు. రూ.1.95 లక్షలు మాయమైనట్టు గ్రహించాడు. సిమ్ బ్లాక్ చేయించినప్పటికీ సైబర్ నేరగాళ్లు వృద్దుడి బ్యాంకులో నుండి డబ్బు అప్పటికే కాజేసారు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వృద్దుడితో పాటే ఆటో లో ప్రయాణిస్తున్న బాలానగర్ కు చెందిన మహమ్మద్ మొహినుద్దీన్, మహమ్మద్ సయ్యద్ సల్మాన్ మాటల్లోమభ్యపెట్టి సెల్ ఫోన్ తస్కరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Read More
Next Story