
పాశమైలారంలో మరో పేలుడు
పెద్ద శబ్దంతో స్థానికులు కలవరపాటు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలో మరో పేలుడు సంభవించింది. బుధవారం పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు కలవరపడ్డారు.
కెమికల్ డ్రమ్ములను పెద్ద ఎత్తున తగలబెట్టడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.ఇటీవల పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలభై మంది మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.
పాశమైలారం ఘటనలో బాధితులు చాలామంది ఇంకా కోలుకోలేదు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాలం చెల్లిన యంత్రాలను వినియోగించడం వల్లే సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక వాడల్లో తనిఖీలు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని
రాష్ట్ర ప్రభుత్వం హామి ఇచ్చింది. బుధవారం మరో మారు పేలుడు సంభవించడం పారిశ్రామికవాడల్లో భధ్రతపై ప్రశ్న తలెత్తింది.
Next Story