కర్రెగుట్టల్లో మరో మారు తుపాకీల మోత
x
cross fire in Karreguttalu forest

కర్రెగుట్టల్లో మరో మారు తుపాకీల మోత

హిడ్మాను అంతమొందించడానికే..


మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా జరుగుతున్న తెలంగాణ- చత్తీస్ గడ్ సరిహద్దు కర్రెగుట్టల్లో శుక్రవారం మరో మారు తుపాకీ చప్పుళ్లు వినిపించాయి. భధ్రతా బలగాలు కర్రెగుట్టల్లో క్యాంపులను ఏర్పాటు చేసుకునే క్రమంలో అక్కడికి వెళ్లాయి. మావోయిస్టులు భధ్రతాబలగాలపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం భధ్రతాబలగాలు మావోయిస్టులపై కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. మావోయిస్టు, అగ్రనేత హిడ్మా నేతృత్వంలోని పిఎల్ జి ఒకటో బెటాలియన్ సభ్యులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారని పక్కా సమాచారం ఉండటంతో భధ్రతా బలగాలు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది.


ఇటీవలె మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు ఎక్కువైన నేపథ్యంలో కర్రెగుట్టల్లో మరో మారు భయానక వాతావరణం ఏర్పడింది. 288 చదరపు కిలో మీటర్ల విస్తరించిన కర్రెగుట్టల్లో తెలంగాణలో 90 కిలోమీటర్లు విస్తరించింది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టులు ఎక్కువగా కర్రెగుట్టల్లోనే తలదాచుకున్నట్లు సమాచారం. బచావో కర్రె గుట్టలు, ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను నిర్మూలించే కార్యక్రమాలు ఎక్కువగా కర్రెగుట్టల్లోనే జరిగాయి. 24 వేల మంది సాయుధ కేంద్ర బలగాలు స్థావరం చేసుకుని ఆపరేషన్లు చేసాయి. డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది. ఆరుగురు పిఎల్ జి సభ్యులు కర్రెగుట్టల్లోనే హతమయ్యారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ కేవలం ఆరుగురు మావోయిస్టులు మాత్రమే కర్రెగుట్టల్లో చనిపోవడం భధ్రతా బలగాలకు నిరాశ పరిచింది.


ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత చత్తీస్ గడ్ లోని కేంద్రబలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే ఆపరేషన్ కగార్ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర బలగాలు మళ్లీ కర్రెగుట్టల్లోకి వచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు వచ్చినప్పటికీ పెద్దగా పురోగతి సాధించలేదు. వెయ్యి మంది తలదాచుకున్న ఓ బంకర్ ను భద్రతా బలగాలు గుర్తించాయి.

కర్రెగుట్టల్లో 30 భారీ కొండలు ఉన్నాయి. మావోయిస్టులు ఇక్కడే తలదాచుకున్నట్లు భధ్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. చత్తీస్ గడ్ బలగాలు ఎక్కువగా అబూజ్ మడ్ వైపు ఫోకస్ పెట్టాయి. కరడు గట్టిన మొంథా తుఫాను కారణంగా కర్రెగుట్టల్లో బురదవల్ల నడవడమే కష్టంగా ఉంది. ఒక్కసారిగా తుపాకీల మోత వినిపించడంతో ఖమ్మం, ములుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏమవుతుందో నని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Read More
Next Story