మామునూరు ఎయిర్ పోర్టుకు మరో 90 కోట్లు మంజూరు
x

మామునూరు ఎయిర్ పోర్టుకు మరో 90 కోట్లు మంజూరు

280.3 ఎకరాల భూ సేకరణ కోసం నిర్ణయం


తెలంగాణలో ప్రతిష్టాత్మక వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రూ 90 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఎయిర్ పోర్ట్ అభివృద్ది కోసం 280.3 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. గత జులై నెలలో రూ 205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ 90 కోట్ల రూపాయలు విడుదల చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది.

విమానాశ్రయ నిర్మాణం, అభివృద్దికి 280 ఎకరాల 30 గుంటలను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ధీటుగా నిలుస్తుంది.

భూ సేకరణ, అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ295 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టయ్యింది. ఎయిర్ పోర్టు కోసం భూములను కోల్పోయిన రైతులు, యజమానులకు ఈ మొత్తంలో నుంచి ఖర్చు చేయనున్నారు. వరంగల్ లో ఎయిర్ పోర్టు నిర్మించాలంటూ ఎయిర్ పోర్టు అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మామునూరు ఎయిర్ పోర్టు కల ఈనాటి కాదు

దేశంలోనే అతి పెద్ద విమానాశ్రయాల్లో మామునూరు ఎయిర్ పోర్టు ఒకటి. ఇండిపెండెన్స్ రాాాాాాాాాక పూర్వం నుంచే ఈ విమానాశ్రయం ఉంది. నిజాం రాజులు దీన్ని 1930లో నిర్మించారు. ఆఖరి నిజాం రాజు ప్రిన్స్ ముకరంజా దీన్ని జాతికి అంకితం చేశారు.

ఇండో- చైనా యుద్ద సమయంలో శత్రువులు ఢిల్లీ ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకున్నప్పుడు రక్షణ దళాలకు మామునూరు ఎయిర్ పోర్టు సేవలను అందించింది. 1875 ఎకరాల భూమిలో 6.6 కిలోలు రన్ వే ఉంది. కాల క్రమంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఎయిర్ పోర్టు భూములు కనుమరుగై చివరకు 1981లో మామునూరు ఎయిర్ పోర్టును మూసివేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.

మామునూరు ఎయిర్ పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ భూ సేకరణ తలనొప్పిగా మారింది. పాత మామునూరు ఎయిర్ పోర్టు భూములు కనుమరుగు కావటంతో కొత్త ఎయిర్ పోర్టు కోసం రైతులు తమ భూములను అప్పగించడానికి సిద్దంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను స్వీకరించి మెజారిటీ రైతులు తమ భూములను అప్పగించడానికి వెనకాడుతున్నారు. భూమికి భూమి ఇస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతుల నుంచి భూమి పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ పెరిగింది. భూమికి భూమి ఇవ్వాలని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎయిర్ పోర్టు రాకతో ఉత్తర తెలంగాణలోని వరంగల్ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

Read More
Next Story