Meerpet | వెంకటమాధవి హత్య కేసులో మరో ట్విస్ట్,కస్టడీలో గురుమూర్తి
x

Meerpet | వెంకటమాధవి హత్య కేసులో మరో ట్విస్ట్,కస్టడీలో గురుమూర్తి

వెంకటమాధవి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది.పోలీసులు మాజీ జవాన్ గురుమూర్తిని పోలీసు కస్టడీకి తీసుకున్నారు.ఈ హత్యలో మరో ముగ్గురి హస్తం ఉందని చెబుతున్నారు.


ఓ మహిళతో సంబంధం పెట్టుకున్న మాజీ సైనికుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అత్యంత దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కరులో ఉడికించి చెరువులో, డ్రైనేజీలో పడేసిన ఘటన సంచలనం రేపింది. వెంకటమాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని, ఓ మహిళతో సహా మరో ఇద్దరు నిందితులు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంచలనం రేపిన ఈ కేసులో రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు స్వయంగా విచారించి నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశంతో రిమాండుకు తరలించారు. గురుమూర్తిపై బీఎన్ఎస్ యాక్ట్ 103(1),238,85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. గురుమూర్తికి వెంకటమాధవి హత్య కేసులో మరో ముగ్గురు సహకరించారని సమాచారం.


అయిదు రోజుల పోలీసు కస్టడీకి గురుమూర్తి
రిమాండు కింద జైలులో ఉన్న మాజీ జవాన్ గురుమూర్తిని మీర్ పేట పోలీసులు శనివారం నుంచి అయిదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వెంకటమాధవి హత్య కేసులో గురుమూర్తికి సహకరించిన వారిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. గురుమూర్తి కుటుంబసభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ హత్య కేసులో నిజానిజాలు బయటపెట్టేందుకు గురుమూర్తికి అవసరమైతే పాలీగ్రాఫ్ టెస్ట నిర్వహించాలని పోలీసులు యోచిస్తున్నారు.

మరో ముగ్గురు కుటుంబసభ్యుల సహకారం
ఈ కేసులో గురుమూర్తికి సహకరించిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వెంకటమాధవి మృతదేహాన్ని ముక్కలుగా చేయడం, వాటిని వేడినీళ్లలో ఉడికించడం, ఎముకల్ని కాల్చి పొడిచేయడం ఒక్క గురుమూర్తి చేయలేదని, అతనికి మరో ముగ్గురు సహకరించారని పోలీసులకు క్లూ దొరికింది. దీంతో ఏ1గా గురుమూర్తిని, మరో ముగ్గురి పేర్లను వెంకటమాధవి హత్య కేసులో పోలీసులు చేర్చారు. గురుమూర్తి పోలీసు విచారణ ముగిసేలోగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.


Read More
Next Story