
నటుడు పోసానిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు నటుడు పోసాని.
నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లోని పోసాని నివాసానికి వచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన అరెస్ట్ సమాచారాన్ని రాయదుర్గం పోలీసులకు అందించిన తర్వాత ఆయనను రాయచోటి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా అరెస్ట్ చేసే సమయంలో పోసాని కృష్ణమురళికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు నటుడు పోసాని. కేసు ఉన్న సమయంలో ఎక్కడికి వచ్చి అయినా అరెస్ట్ చేసే అధికారం తమకుందంటూ సదరు అధికారి సమాదానం ఇచ్చారు. ఈ మేరకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోసాని కృష్ణమురళి అరెస్ట్
— Subbu (@Subbu15465936) February 26, 2025
రాయదుర్గం లోని మై హోం భుజ అపార్ట్మెంట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు
అదుపులోకి తీసుకుని రాయచోటి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు#posanikrishnamurali #APpolice pic.twitter.com/bhbpiTgWz9
అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులోనే పోసానిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో పోసానిని విచారించడానికి పోలీసులు ఆయనను రాయచోటికి తరలించనున్నట్లు తెలుస్తోంది. గురువారం పోసానిని కోర్టులో హాజరుపరిచి పోలీసులు రిమాండ్ కోరవచ్చని సమాచారం.