కెటిఆర్ ఆదేశం మేరకు నిధులు మళ్లించాను: అరవింద్ కుమార్
x

కెటిఆర్ ఆదేశం మేరకు నిధులు మళ్లించాను: అరవింద్ కుమార్

నా కెలాంటి స్వార్ధం లేదు


తెలంగాణలో సంచలన సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A2 నిందితుడైన ఐఏఎస్ అరవింద్ కుమార్ గురువారం ఎసిబి విచారణకు హాజరయ్యారు. అప్పటి మున్సిపల్ మంత్రి కెటీఆర్ తనకు వాట్సాప్ ఆదేశాల ప్రకారమే తాను నిధులు మళ్లించినట్టు ఆయన చెప్పారు. మున్సిపల్ మంత్రి హోదాలో తనకు వాట్సాప్ సందేశం పంపారు అని అరవింద్ కుమార్ అన్నారు. రూ 45 కోట్ల నిధులు విదేశీ కంపెనీ FEO కి నిధులు విడదల చేయాలని కెటీఆర్ ఆదేశించినట్టు అరవింద్ కుమార్ విచారణ సందర్బంగా ఎసిబి అధికారులకు చెప్పారు. తనకెలాంటి స్వార్థం లేదని మంత్రి చెప్పినట్టు నడుచుకున్నాను తప్పితే వేరే ఉద్ద్యేశ్యం లేదని ఎసిబి అధికారులకు ఐఎఎస్ అధికారి చెప్పారు.

మరో మారు కలిపి విచారణ

హెచ్ ఎం డిఎ డైరెక్టర్ గా ఉంటూ అరవింద్ కుమార్ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ ను ఇప్పటికే రెండుసార్లు ఎసిబి విచారణ చేసింది. విచారణ చేస్తున్న సమయంలో కెటీఆర్ ఇచ్చిన సమాధాల నేపథ్యంలో అరవింద్ కుమార్ ను విచారణకు పిలిచారు. కెటీఆర్, అరవింద్ కుమార్ లను కలిపి ఎసిబి మరో మారు విచారణ చేసే అవకాశముందని తెలుస్తోంది. క్యాబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేసు కోసం నిధులు మళ్లించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆర్థిక నిబంధనలను పాటించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అరవింద్ కుమార్ సమాధానాల నేపథ్యంలోచార్జిషీట్ వేయడానికి ఎసిబి సిద్దమైంది.

Read More
Next Story