మావోయిస్టులతో తెలంగాణ నేతలు కుమ్మక్కయ్యారా  ?
x
Bandi Sanjay

మావోయిస్టులతో తెలంగాణ నేతలు కుమ్మక్కయ్యారా ?

మావోయిస్టుల(Maoists)తో అంతటి గట్టి సంబంధాలున్న నేతలు ఎవరా అన్న చర్చ మొదలైంది.


కేంద్రహోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ‘మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా ? ఖబడ్దార్’ అంటు ఆదివారం బండి(Bandi Sanjay) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సాయుధవర్గాలతో సంబంధాలను తెంచుకోకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సుంటుందని హెచ్చరించారు. సంబంధాలు తెంచుకోకపోతే గుట్టుబయటపడుతుందని అప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కోకతప్పదన్నారు. అయితే బండి తన ట్వీట్లో ఏ ఒక్కరి పేరును ప్రస్తావించలేదు. దాంతో మావోయిస్టుల(Maoists)తో అంతటి గట్టి సంబంధాలున్న నేతలు ఎవరా అన్న చర్చ మొదలైంది.

దేశభద్రతకు ముప్పుగా పరిగణించేవాళ్ళు ఎంతటి వాళ్ళయినా నరేంద్రమోదీ, అమిత్ షా వదిలిపెట్టరని గట్టిగా చెప్పారు. వాళ్ళపైన ఎలాంటి కరుణచూపకుండా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అంతర్గత భద్రత విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజీ ఉండదన్నారు. మావోయిస్టులవైపు నిలబడే వాళ్ళు ఎప్పటికైనా పడిపోక తప్పదని హెచ్చరించారు. ఇదేసమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా కర్రెగుట్టల అడవుల ద్వారా తెలంగాణలోకి ప్రవేశించినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు చెప్పినట్లు వచ్చిన కథనాన్ని కూడా బండి తన ట్వీట్లో ప్రస్తావించారు.

ఇంతకీ బండి ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే ఈమధ్యనే పోలీసులకు లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ మాట్లాడుతు కొంతమంది తెలంగాణ రాజకీయ నేతలు మావోయిస్టులతో కుమ్మక్కయినట్లు చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే బండి ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా ట్వీట్లో వార్నింగిచ్చారు.

Read More
Next Story