ఎలక్ట్రిక్ బస్సుల చాటున  జేబు దొంగలు
x

ఎలక్ట్రిక్ బస్సుల చాటున జేబు దొంగలు

ఎలక్రికల్ బస్ లు స్మూత్ గా పోతుంటాయి. మంచి ప్రయాణం. సకాంలో గమ్యానికి చేరొచ్చు.. ఇదీ అందరు అనుకునే మాట. అయితే టిక్కెట్ ధర గురించి తెలుసుకోవాలి.


విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకునేందుకు విద్యుత్ చార్జింగ్ బస్ లు రాత్రి పగలు వున్నాయి. ఈ బస్ ల్లో ప్రయాణం చాలా బాగుంటుందని అందరూ అనుకుంటారు. ట్రావెల్స్ లో టిక్కెట్లు బుక్ చేద్దామని అమెజాన్ పే ద్వారా రెడ్ బస్ లో టిక్కెట్లు బుక్ చేస్తే బాదుడు ఎలా ఉంటుందో తెలుసుకుంటే రెండో సారి బస్సెక్కాలంటే కాస్త వెనుకడుగు వేయాల్సిందే. పక్కపక్క సీట్లలోనూ టిక్కెట్ రేట్లు తేడా వుంటాయి. ఇదేందబ్బా అనుకుంటున్నారా? అదంతే. ఇలా కూడా టిక్కెట్ రేట్లు వుంటాయని ఇప్పుడే తెలిసింది.

విజయవాడ నుంచి హైదరబాద్ ఎర్రగడ్డకు ఈ టిక్కెట్ NueGo బస్ లో బుక్ చేస్తే విండో సీటు నెంబరు 6ఎ చార్జి రూ. 796 లు, పక్కనే విండో సీటు పక్క 6బి బుక్ చేస్తే రూ. 735 లు. బుక్ చేసిన సమయం ఒకటే. పక్కపక్క సీట్లు. పైగా ప్రయాణ సమయం ఎంతో తెలుసా? 7.25 గంటలు. సాధారణ ఆర్టీసి బస్ ప్రయాణ సమయం ఎంతో తెలుసా? నాలుగు గంటలు. పక్కపక్క సీట్లు బుక్ చేస్తే టిక్కెట్ తేడా ఎంతో తెలుసా? రూ. 61లు నాలుగు గంటల గ్యాప్ తరువాత అదే బస్ కు టిక్కెట్ బుక్ చేస్తే చార్జీ ఎంత పడిందో తెలుసా? రూ. 836 లు. అంటే రూ. 101 లు ఎక్కువన్న మాట. పైగా బస్ వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాఫ్ వద్ద సీట్లు వున్నాయా? అంటూ ప్రయాణికులు అడిగితే డ్రైవర్ చెప్పిన మాట వింటే దిమ్మ తిరుగుతుంది. కాస్త లేటయితే సీటు వుండేది కాదు. ఉన్నా రూ. 2000 లు అవుతందన్నారు. ఇదీ NueGo బస్ లో ప్రయాణం తీరు.


ఇంతటితో వదిలారనుకున్నావా. బస్ బయలుదేరి ఉదయం తొమ్మది గంటలకు చీకటిగూడెం వద్దకు చేరుకుంది. అక్కడ 40 నిమిషాలు బస్ కు చార్జింగ్ పెట్టాలని, టిఫిన్ చేసే వారు వుంటే చేయాలని బస్ డ్రైవర్ చెప్పారు. చుట్టుక్కల ఏమీలేవు. ఈ ప్రైవేట్ బస్ ల యజమానుల వారే అక్కడ ఒక పెద్ద రేకుల షెడ్డు వేశారు. అందులో అదిరిపోయే ధరలు. ఆ ధరలు ఎలా వున్నాయంటే స్టార్ హోటల్ మెనూను తలపించాయి. రెండు ఇడ్లీ రూ. 69 లు, ఆనియన్ దోశ 127 లు, ఘీ దోశ రూ. 150 లు, నెల్లూరు కారం దోశ రూ. 180 లు, కాఫీ రూ. 40 లు ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు.

సాధారణంగా బయట హోటల్స్ లో రోజూ తినే టిఫిన్ కంటే భిన్నమైన రుచికానీ, కనువిందు చేసే ప్రత్యేకతలు ఏమీ లేవు. ఎంత అవలీలగా ప్రయాణికులను దర్జాగా దోచుకుంటున్నారో చూస్తే ఆహా.. అనిపించక మానదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ఎలక్ట్రికల్ బస్ లో వాలంటే ఇంత తతంగం ఉంటుందని. 40 నిమిషాలు చార్జింగ్ అని చెప్పిన డ్రైవర్ సుమారు గంటా 10 నిమిషాలు అక్కడక్కడ తిరిగి బస్సెక్కాడు. వనస్థలిపురం నుంచి ఎర్రగడ్డకు బస్ చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా మినిమం రెండు గంటలు. ఆహా ఏమి హాయిలే అలా.. అనుకుంటూ ప్రయాణించాలే తప్ప ఏ మాత్రం ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే డ్రైవర్ కు కోపం వచ్చే అవకాశం ఎక్కువ.


Read More
Next Story