
హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ బీచ్
రేవంత్ చెప్పే ఫ్యూచర్ సిటీ(Future City) కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు అవబోతోంది
హైదరాబాదు వాసుల గట్టిగా చెప్పాలంటే తెలంగాణ వాసులకల తొందరలోనే నిజం కాబోతోంది. ఒక ఆర్టిఫిషియల్ బీచ్ ను సృష్టించాలని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పర్యాటక శాఖ(Telangana Tourism) ఆధ్వర్యంలో ఏర్పాటవ్వబోయే కృత్రిమబీచ్ ను పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్(PPP) పద్దతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్(Samshabad) మండలం పరిధిలో కొత్వాల్ గూడ అనే ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వానికి చెందిన 35 ఎకరాల్లో ఆర్టిఫిషియ్ బీచ్(Artificial Beach) ను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది. తరచు రేవంత్ చెప్పే ఫ్యూచర్ సిటీ(Future City) కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు అవబోతోంది. ఒకపుడు సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో సముద్ర తీరముంది కాబట్టి బీచ్ లు అక్కడే ఎక్కువగా ఉన్నాయి.
పిల్లలు, యువతకు సముద్రమన్నా, బీచ్ లన్నా మక్కువ ఎక్కువగా ఉంటుంది. అందుకనే బీచ్ లకు వెళ్ళాలని అనుకున్న యువత, చిన్నపిల్లలు సీమాంధ్ర ప్రాంతంలోని వైజాగ్, మచిలీపట్నం, ఒంగోలు, బాపట్ల, భీమిలీకి ఎక్కువగా వెళుతుంటారు. టూరిజం ప్యాకేజీ తరహాలో వెళ్ళాలని అనుకునే వారు మహాబలిపురం, కేరళ, కర్నాటకకు కూడా వెళుతుంటారు. ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్ హైదరాబాద్ కు దగ్గరలోనే ఒక ఆర్టిఫిషియల్ బీచ్ ఎందుకు ఏర్పాటుచేయకూడదని ఆలోచించింది. వెంటనే ప్రైవేటు సంస్ధలతో సంప్రదింపులు జరిపింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఆర్టిఫిషియల్ బీచ్ కాన్సెప్టు సక్సెస్ అయ్యింది.
టోక్యో, సింగపూర్, మొనాకో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, చైనా, ఫిలిప్పీన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో ఆర్టిపిషియల్ బీచ్ కన్సెప్ట్ బాగా సక్సెస్ అయ్యింది. అదే తరహాలో కొత్వాల గూడలో కూడా బీచ్ ఏర్పాటు కాబోతోంది. ఇందులో సముద్రంలో ఉన్నట్లే అలలు వచ్చే ఏర్పాటు కూడా ఉంటుంది. సముద్రంలో నుండి ఒడ్డుకు నీరు కొట్టుకుని రావటం, మళ్ళీ లోపలకు వెళిపోవటం లాంటి నిజమైన అనుభూతినే ఆర్టిఫిషియల్ బీచ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీని ఆధారంగానే అడ్వెంచరస్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్ళు, రిసార్ట్స్, ఫుడ్ కోర్టులు, సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్సులు కూడా రెడీ అవుతాయి.
ఈ ఏడాది డిసెంబర్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ప్రభుత్వం అనుకున్నది. 35ఎకరాల్లో ఏర్పాటుచేయబోతున్న కాల్పనిక బీచ్ కు సుమారు రు. 250 కోట్ల పెట్టుబడి అవసరమని పర్యాటక శాఖ అంచనా వేసింది. ఇంతమొత్తాన్ని ప్రభుత్వ ఖర్చుచేయలేందు కాబట్టే ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్పు పద్దతిలో టేకప్ చేయబోతోంది. డిసెంబర్లో పనులు మొదలుపెట్టి మూడేళ్ళల్లోనే పూర్తిచేయాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రాజెక్టు గనుక పూర్తయితే తెలంగాణ(హైదరాబాదు)వాసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.