30 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...మొదలైన టెన్షన్
x
Revanth with Kaleshwaram report

30 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...మొదలైన టెన్షన్

కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టడం ఖాయం


బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైపోయుంటుంది. ఎందుకంటే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ఖారరయ్యాయి. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారభమవుతున్నాయి. నాలుగురోజులు సమావేశాలు జరపాలని ఎనుమల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం అనుకున్నది. అయితే సమావేశాలు ఎన్నిరోజులు జరగాలన్న నిర్ణయం 30వ తేదీన జరగబోయే బిజినెస్ అడ్వయిజరీ కమిటి(బీఏసీ)సమావేశంలో ఫైనల్ అవుతుంది. సమావేశాలు మొదలయ్యే(Telangana Assembly session) తేదీ ఖారరైంది కాబట్టి చర్చించాల్సిన అజెండా కూడా అధికార కాంగ్రెస్ రెడీచేసుకునే ఉంటుంది. అందరు ఎదురుచూస్తున్నది మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram report)లో జరిగిన అవినీతి, అవకతవకలపైన చర్చగురించే. ఇదే విషయమై దాదాపు 15 నెలలు విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందించింది.

ఈ రిపోర్టుపైనే అసెంబ్లీలో ప్రధానంగా చర్చజరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కమిషన్ రిపోర్టును కొట్టేయాలని, రిపోర్టు ఆధారంగా తమపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో కేసు వేశారు. అయితే వీళ్ళ కేసులనే కోర్టు కొట్టేసింది. ఎందుకంటే కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టి చర్యల విషయాన్ని ఫైనల్ చేస్తామని ప్రభుత్వం కోర్టులో చెప్పింది. అందుకనే కేసీఆర్ వాదనను కోర్టు కొట్టేసింది. కాబట్టి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టడం ఖాయం. ఇందులో భాగంగానే 665 పేజీల రిపోర్టును ప్రభుత్వం 250 కాపీలు తీయించినట్లు తెలిసింది. కమిషన్ రిపోర్టు కాపీలను అసెంబ్లీలోని 175 మంది ఎంఎల్ఏలు, శాసనమండలిలోని 40 మంది సభ్యులకు ఇవ్వబోతున్నది. అసెంబ్లీలో చర్చ మొదలైన తర్వాత అదే రిపోర్టును జనాలందరికీ అందుబాటులో ఉంచటంలో భాగంగా వెట్ సైట్లో కూడా అప్ లోడ్ చేయబోతున్నది.

ఇక్కడే బీఆర్ఎస్ బాగా ఇబ్బంది పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలు ప్రజలందరికీ తెలిసిపోతుందని తీవ్ర అసహనం వ్యక్తంచేస్తోంది. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి, అవకతవకలకు కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆర్, హరీషే అని కమిషన్ తన రిపోర్టులో స్పష్టంగా చెప్పేసింది. జరిగిన అవకతవకలు ఏమిటి ? ఏకపక్షంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయలు, వాటి ఫలితాలు ? వేలాది కోట్లరూపాయలు ఎలాగ దుర్వినియోగం అయ్యిందన్న విషయాన్ని చాలా డీటైల్డ్ గా కమిషన్ వివరించింది. ఇపుడా వివరాలన్నీ ప్రజలముందుకు చేరితే తమ పరువుకు భంగం కలుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీలో చర్చను, రిపోర్టును ప్రజలముందు ఉంచకూడదన్న పాయింట్ మీదే కేసులు వేస్తే కోర్టు వాళ్ళ వాదనను కొట్టేసింది. 30వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ రిపోర్టులో ఏముందన్నది పూర్తిగా బహిర్గతమవబోతోంది. మరి చర్చల్లో ఏమి తేలుతుందో ? బాధ్యులపై ఏ పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని సూచిస్తుందో చూడాలి.

Read More
Next Story