మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్..
x

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్..

గవర్నర్ కోటాలో కాకుంటే ఎమ్మెల్యే కోటాలో అయినా ఎమ్మెల్సీ పక్కానా..!


తెలంగాణ మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోమవారం.. సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ముస్లిం ప్రార్థనల మధ్య తన ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరిస్తూ సంతకం చేశారు. మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన రాకతో తెలంగాణ క్యాబినెట్ స్ట్రెంత్ 16కి చేరింది. అనేక విమర్శల మధ్య అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించింది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తొలుత ప్రచారం మొదలైంది. అప్పటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మైనార్టీల ఓట్ల కోసమే కాంగ్రెస్.. ఈ వ్యూహం పన్నిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు. అంతేకాకుండా అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మంత్రి పదవి ఎలా ఇస్తారని కూడా వారు ప్రశ్నించారు. కానీ ఏది ఏమైనా అక్టోబర్ 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్.

హాట్ హాట్‌గా మారిన అజారుద్దీన్ పదవి..

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ నిర్ణయం సంచలనంగా మారింది. రేవంత్ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉపఎన్నికల్లో ముస్లింల ఓట్లకోసమే అజహర్ ను రేవంత్ మంత్రిగా తీసుకుంటున్నారంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు. బీజేపీ నేతలైతే ప్రమాణస్వీకారం చేయకుండా చూడాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీ సుదర్శనరెడ్డిని కలిసి అభ్యంతరం కూడా వ్యక్తంచేశారు.

అయితే వీళ్ళు అభ్యంతరం లేవనెత్తేసమయానికి ప్రభుత్వం నుండి మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అదికారిక ప్రకటన వెలువడగానే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ కు ఇదే విషయాన్ని తెలియజేస్తు లేఖ రాశారు. అయితే సుదర్శనరెడ్డి రాసిన లేఖకు ఏమని సమాధానం వచ్చిదో తెలీదు. అసలు సమాధానం వచ్చిందా అనే విషయంలో కూడా క్లారిటిలేదు. ఏదేమైనా ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య అజహర్ ముందుగా అనుకున్నట్లే మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు.

అజారుద్దీన్‌కు ఆరునెలలే టైం..

అయితే అజారుద్దీన్‌కు అందిన మంత్రిపదవి నిలబెట్టుకోవడానికి ఆయన దగ్గర ఆరునెలలే సమయం ఉంది. ఆయన ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కూడా కాకపోవడంతో.. మంత్రి పదవి ఉండాలంటే.. ఆరునెలల్లో ఎమ్మెల్సీ అవ్వాలి. ఇప్పటికే అజారుద్దీన్, కోదండరామ్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించింది. కాగా అది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. అయితే గవర్నర్ కోటాలో కాకపోతే అజహర్ ను ఎంఎల్ఏల కోటాలో భర్తీచేయటానికి అధిష్ఠానం రెడీగా ఉంది. అందుకనే ఇపుడు క్రికెటర్ కు మంత్రిపదవి ఇచ్చేసింది. ఆరుమాసాల్లో ఏదో ఒక కోటాలో ఎంఎల్సీ అవుతాడు కాబట్టి టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు ఉండవని విశ్లేషకులు చెప్తున్నారు.

Read More
Next Story