ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడం ఇంత కష్టమా!
x

ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడం ఇంత కష్టమా!

బి నర్సింగ్ రావు పేరు విన్నారుగా. మాభూమి, రంగుల కల వంటి సినిమాలు తీసారు. తెలంగాణ ప్రజాకళల వ్యాప్తి ఆయన వ్యాపకం. కాని, ఆయన సిఎం రేవంత్ కు బాధతో ఒక లేఖ రాశారు.


తెలంగాణ ముఖ్యమంత్రి గారికి


తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి వంద రోజులు నిండిన సందర్భంగా అభినందనలు. ఈ వంద రోజులుగా నేను మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రంగాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి వెళుతున్నారు. అలాంటి అవకాశం నాకు రాకపోవడం విడ్డూరంగా ఉంది. నన్ను నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదనుకుంటాను.

బి నర్సింగ్ రావు, నిర్మాత, దర్శకుడు, కళాకారుడు



ఈ లేఖ రాయడానికి ముఖ్య కారణం, నేను మీతో కలిసి కొన్ని అత్యవసర విషయాలు మాట్లాడవలసి ఉండడమే : తెలంగాణ ప్రజా సంస్కృతిక సినిమా రంగాల గురించి మీతో మాట్లాడాలి. ఈ సందర్భంలో ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఇంకా కాలయాపన మంచిది కాదు. పైన పేర్కొన్న రంగాలలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ముఖ్యమైన అంశాలను మనం పూర్తి చేయవలసి ఉంది. పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ సాంస్కృతిక అంశాలను నేటి ప్రభుత్వం పైకిఎత్తి పట్టుకోవలసిన అవసరం కోసం ప్రణాళికలు రూపొందించుకొని తెలంగాణను నూతనంగా ఆవిష్కరించుకునే అంశాలను మీతో నేను చర్చించాలి. దీనికి మీ స్పందన కోసం వేచి ఉంటాను.

శుభాభినందనలతో
బి .నరసింగరావు


Read More
Next Story