తెలంగాణలో ఎగ్ మయనైజ్ తయారీ, విక్రయాలపై నిషేధం ?
x

తెలంగాణలో ఎగ్ మయనైజ్ తయారీ, విక్రయాలపై నిషేధం ?

కోడిగుడ్డు మయనైజ్ విషాహారంగా మారడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..వరుసగా పది కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో తెలంగాణలో దీన్ని నిషేధించాలని నిర్ణయించింది.


కోడిగుడ్డు సొనతో తయారు చేసిన కోడిగుడ్డు మయనైజ్ తిన్న వారు విషాహారంగా మారడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 10 మంది కోడిగుడ్డు మయనైజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

- తాజాగా సికింద్రాబాద్ లో ఎగ్ మయనైజ్ తిని అస్వస్థతకు గురయ్యారని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. సికింద్రాబాద్‌లో కోడిగుడ్డు మయనైజ్ కలిపిన షావర్మా తిన్న నలుగురు వ్యక్తులు డయేరియా, వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు.
- ఈ ఏడాది జనవరి 17వతేదీన అల్వాల్ ప్రాంతంలో ఎగ్ మయనైజ్ తిన్న వారు వాంతులు విరోచనాలు, జ్వరం, డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు.

ఎగ్ మయనైజ్ లో హానికరమైన మైక్రో ఆర్గాన్లు
ఎగ్ మయనైజ్ తిన్నవారు తరచూ విషాహారంగా మారడంతో అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో హానికరమైన వీటి శాంపిళ్లను సేకించి ఫుడ్ లాబోరేటరీలో పరీక్షించారు. ఎగ్ మయనైజ్ లో హాని కరమైన సూక్ష్మజీవులు ఉన్నాయని పరీక్షల్లో తేలింది.

కేరళలోనూ ఎగ్ మయనైజ్ పై నిషేధం
దేశంలో మొట్టమొదటి సారి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్ మయనైజ్ ను నిషేధించింది. కోడిగుడ్ల సొనతో తయారు చేసిన ఎగ్ మయనైజ్ ను నిల్వ చేయడం, విక్రయించడం, తయారు చేయడాన్ని నిషేధించారు. కేరళ బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుతం కూడా కోడిగుడ్డు మయనైజ్ ను నిషేధించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని తినుబండారాలు,సూపర్ మార్కెట్ల నుంచి గుడ్డు మయనైజ్ ను నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.జనాదరణ పొందిన ఎగ్ మయనైజ్ డిప్‌ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైనందున దీన్ని నిషేధించాలని ఆహార భద్రత అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.ఈ నిషేధం అమలు చేస్తే, గుడ్డు మయనైజ్ రాష్ట్రంలో నిషేధించిన మొదటి ఆహార ఉత్పత్తి అవుతుంది.



డెయిరీ స్టోర్‌పై ఫుడ్ సేఫ్టీ టీమ్ దాడులు

తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో ఉన్న కోహినూర్ డెయిరీ ఉత్పత్తుల దుకాణంలో తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది.డెయిరీ అపరిశుభ్రంగా ఉందని, పాల సేకరణ, విక్రయాల రికార్డులకు సరైన పత్రాలు లేవని తనిఖీ బృందం గమనించింది. నాణ్యత నియంత్రణ ల్యాబ్ అందుబాటులో లేదని వారు గుర్తించారు.

షావర్మా అవుట్ లెట్లలో తనిఖీలు
రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం సికింద్రాబాద్ ప్రాంతంలోని షావర్మా వెండింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించింది.హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ముజ్తాబా గ్రిల్స్, షాషా సహందర్ షావర్మ, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని రోల్స్ ఆన్ వీల్స్ అవుట్‌లెట్‌లతో పాటు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని సింక్ షావర్మా, ఏషియన్ చౌ చైనీస్‌తో సహా పలు షావర్మా జాయింట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చేశారు.లేబులింగ్ లేకపోవడం, మాంసం,పన్నీర్ వంటి ముడి పదార్థాలను సరిగ్గా నిల్వ చేయలేదని తేలింది. షావర్మా జాయింట్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది.షావర్మా దుకాణాల్లో ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవు.వెండింగ్ యూనిట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.ముజ్తబాలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.

కోహినూర్ డెయిరీలో...
కోహినూర్ డెయిరీ సరైన లేఅవుట్ ప్లాన్ లేకుండా షెడ్ లో యూనిట్ నిర్వహిస్తున్నారని, తయారీ యూనిట్‌ వద్ద పాల సేకరణ గురించి సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. డెయిరీ ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉంది.

Read More
Next Story