జగన్ పై బండి ఫుల్ ఫైర్
x
Central Minister Bandi Sanjay

జగన్ పై బండి ఫుల్ ఫైర్

తిరుమల శ్రీవారి దర్శనం, ప్రసాదాల తయారీ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు.


తిరుమల శ్రీవారి దర్శనం, ప్రసాదాల తయారీ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తుల ప్రవేశం, డిక్లరేషన్ అంశంపై జగన్మోహన్ రెడ్డిపైన బండి ఫుల్లుగా ఫైరయ్యారు. దేవాలయంలోకి ప్రవేశించేముందు జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని సూటిగా ప్రశ్నించారు. అన్యమతస్తులు దేవాలయాల్లోకి ప్రవేశించేముందు డిక్లరేషన్లు ఇచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయని బండి గుర్తుచేశారు. దళితులే అసలైన హిందూ ధర్మరక్షకులని చెప్పారు. అయితే దళితులను క్రిస్తియన్లుగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

తిరుమల దేవాలయం డిక్లరేషన్ పై జగన్ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారంటు మండిపడ్డారు. తిరుమల దేవాలయంలోకి అన్యమతస్తులు ప్రవేశించాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబందన ఇప్పుడు తీసుకొచ్చింది కాదని ఎప్పటినుండో ఉన్నదే అని బండి గుర్తుచేశారు. తనను తాను క్రిస్తియన్ గా ప్రకటించుకున్న జగన్ తిరుమల దేవాలయంలో డిక్లరేషన్ విషయంలో విచిత్రమైన వాదనను లేవదీస్తున్నారంటు మండిపడ్డారు. గతంలో పూరి దేవాలయంలోకి వెళ్ళాలని ప్రయత్నించిన ఇందిరాగాంధీని పూజారులు అడ్డుకున్నట్లు బండి గుర్తుచేశారు. పార్శీ వ్యక్తిని పెళ్ళి చేసుకున్న కారణంగానే ఇందిరాగాంధీని పూజారులు పూరీ దేవాలయంలోకి వెళ్ళకుండా అడ్డుకున్నట్లు చెప్పారు.

నేపాల్ పశుపతి నాథ్ దేవాలయంలోకి రాజీవ్ గాంధీతో పాటు దర్శనానికి వెళ్ళిన సోనియాగాంధీని అక్కడి ఆలయం అధికారులు అడ్డుకున్నట్లు చెప్పారు. సోనియా క్రిస్తియన్ కావటంతో పాటు పార్శీ వంశస్ధుడైన రాజీవ్ ను వివాహం చేసుకోవటమే సోనియా ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవటానికి కారణమైందన్నారు. బొట్టుపెట్టుకుని, నమాజ్ చేయబోమని చెప్పి, టోపీ పెట్టుకోకుండా హిందువులను మశీదుల్లోకి అనుమతిస్తారా అంటు ప్రశ్నించారు. ప్రార్ధనలు చేయకుండా వాటికన్ సిటి, జెరూసలేంకు హిందువులు వెళతామంటే ఒప్పుకుంటారా ? అని బండి నిలదీశారు. జగన్ తీరుచూస్తుంటే ముమ్మాటికి హిందుత్వంపై జరుగుతున్న దాడిగానే పరిగణించాలన్నారు.

Read More
Next Story