కేటీఆర్ జైలుకు వెళ్తాడు తొందరలో..
x
KTR

కేటీఆర్ జైలుకు వెళ్తాడు తొందరలో..

కేటీఆర్ భవిష్యత్తుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చెప్పిన జోస్యం సంచలనమైంది.


భవిష్యత్తు తెలుసుకోవాలని ఎవరికుండదు ? రేపు ఏమి జరుగుతుందో అనేకన్నా భవిష్యత్తులో ఏమి జరగబోతోందో అని తెలుసుకునేందుకు చాలామందికి చాలా ఆసక్తి ఉంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే కేటీఆర్ భవిష్యత్తుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చెప్పిన జోస్యం సంచలనమైంది. అదేమిటంటే తొందరలోనే కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైలుకు పంపించబోతున్నారట. కేటీఆర్ను రేవంత్ జైలులో వేస్తారన్న నమ్మకం తనకు చాలా బలంగా ఉందన్నారు. ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేటీఆర్ పాల్పడిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలిసిందే అని బండి అన్నారు.

తనతో సహా బీజేపీ నేతలు, కార్యకర్తలను కేటీఆర్ జైలుకు పంపించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదన్నారు. కాబట్టి ఇపుడు అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా కేటీఆర్ ను రేవంత్ జైలులో వేయటం ఖాయమని తేల్చేశారు. పనిలో పనిగా రేవంత్ పైన కూడా బండి ధ్వజమెత్తారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజున కాంగ్రెస్ పై యుద్ధం చేయటం గ్యారెంటీ అని హెచ్చరించారు. రేవంత్ పై యుద్ధం చేయబోయేది బీజేపీనా లేకపోతే కాంగ్రెస్ లోని సీనియర్లా అన్న విషయాన్ని మాత్రం బండి చెప్పలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమైనా తట్టుకోలేనంత స్ధాయిలో యుద్ధం చేస్తామని బండి చెప్పారు.

బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు జరుపుతోందన్న వార్తలంతా ఫేక్ అని చెప్పారు. అవుట్ డేటెడ్ పార్టీ బీఆర్ఎస్ తో తమ పార్టీ ఎందుకు చర్చలు జరుపుతుందని ఎదురు ప్రశ్నించారు. కవిత బెయిల్ కు బీజేపీకి ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావటానికి బీజేపీకి ఏమన్నా సంబంధముందా అని అడిగారు. కోర్టు విషయాలను తమ పార్టీతో ముడిపెట్టడం తగదని హితవుపలికారు. నిజాయితీగా పనిచేసిన ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వటంలేదని బండి మండిపడ్డారు. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మంచి పోస్టింగులు ఇస్తున్నట్లు ఆరోపించారు. తక్కువ టైములో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని బండి ఎద్దేవా చేశారు. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని బండి తేల్చేశారు.

Read More
Next Story