తెలంగాణలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా?
x

తెలంగాణలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా?

తెలంగాణలో ఇప్పటికి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. మంత్రులు, అధికారులు ఫోన్ లో మాట్లాడాలంటే భయపడి పోతున్నారన్నారు.


తెలంగాణలో ఇప్పటికి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. మంత్రులు, అధికారులు ఫోన్ లో మాట్లాడాలంటే భయపడి పోతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందని, అందులో కరీంనగర్ మంత్రి హస్తం ఉందని బండి ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ లతో కాంగ్రెస్ మంత్రి చీకటి ఒప్పందం కుదుర్చుకుని కేసుని డైవర్ట్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అన్నారు.

ఈ కేసులో నేను బాధితుడినే... నాతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి, హరీష్ రావులు కూడా బాధితులేనని బండి పేర్కొన్నారు. సిగ్గులేని కేసీఆర్ భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. కేసీఆర్ కుటుంబం వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు. వాళ్ల నుండి ప్రజలని కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లతోనే కుమ్మక్కై, వాళ్లని కాపాడుతుందంటే ఇప్పటికీ ఫోన్ ట్యాప్ జరుగుతుందన్నట్టే అన్నారు. కొందరు మంత్రులు, అధికారులు ఫోన్లు మాట్లాడాలంటే భయపడుతున్నారు. కాల్ చేస్తే వాట్సాప్ కాల్, ఫేస్ టైమ్ కాల్ చేస్తామని పెట్టేస్తున్నామన్నారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సక్రమంగా జరిపించాలన్నారు. సీబీఐ ఎంక్వైరీ జరిపించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఉందన్నారు.

Read More
Next Story