‘కేసీఆర్‌కు మీకు తేడా ఏంది రేవంత్..’
x

‘కేసీఆర్‌కు మీకు తేడా ఏంది రేవంత్..’

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై బండిసంజయ్ ఘాటు వ్యాఖ్యలు.


కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బడాయి మాటలకు తప్పితే బాధ్యతలు నిర్వర్తించడానికి పనికిరారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చేసిన నిర్వాకం వల్లే ఇప్పుడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నావనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకేన్లు ఇవ్వడం తప్ప వీళ్లు పైసలు ఇవ్వడం లేదని అన్నారు బండి సంజయ్. నరేంద్ర మోదీ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఉద్యోగావగాశాలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 10 లక్షల ఉద్యోగాలు ఇస్తోందని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యగాలను ప్రతి ఏడాది భర్తీ చేస్తోందని గుర్తు చేశారు. మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన సేవా భారతీ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. వీళ్లకు పాలన చేతకాదని అన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్లమని సంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మాట్లాడట్లేదేమి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు, రైతులు అంతా అరిగోస పడుతున్నారని విమర్శించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని సంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో కాంగ్రెస్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, కానీ వాళ్లకు 15లక్షల మంది విద్యార్థులు ఎందుకు కనిపిస్తలేరు? అని నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్ లో నుండి రూ.8 వేల కోట్ల రూపాయలు చెల్లించలేరా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంవల్ల రాష్ట్రంలోని 15 నుండి 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది.

బీఆర్ఎస్‌కు మీకు తేడా ఏంటి..?

‘‘గత పదేళ్లపాటు కేసీఆర్ ఫీజు రీయంబర్స్ మెంట్ ఇయ్యక తిప్పలు పెట్టారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ మేమేనని ఇన్నాళ్లు సంకలు గుద్దుకున్న కాంగ్రెసోళ్లు కూడా 20 నెలలుగా అదే చేస్తున్నారు. బకాయిలు చెల్లించమంటే కల్లబొల్లికబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు? కేసీఆర్ కు, మీకు తేడా ఏముంది? పంజాబ్ పోయి చెక్కులిచ్చి బౌన్స్ చేసి తెలంగాణ పరువును బజారున పడేస్తే.... ఈ కాంగ్రెసోళ్లు టోకెన్ల మీద టోకెన్లు ఇస్తూ మోసం చేస్తున్నరే తప్ప పైసా ఇయ్యడం లేదు. కాంగ్రెస్ నమ్మిన పాపానికి పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్లయింది. ఫీజు రీయంబర్స్ మెంట్ పై ఆధారపడి ఈ రాష్ట్రంలో ఏటా 15 లక్షల మందికిపైగా పేద విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత కోర్సులను చదువుకుంటున్నరు’’ అని వివరించారు.

విద్యార్థులు నడిరోడ్డుపడుతున్నారు..

‘‘నాలుగైదు ఏళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ పైసలు చెల్లించకపోతే వాళ్ల పరిస్థితి ఏంది? ఫీజు రీయంబర్స్ మెంట్ ఉందనే ఉద్దేశంతోనే ఉన్నత విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఇయాళ నడిరోడ్డున పడ్డరు. ఫీజుల కట్టకపోవడంవల్ల కాలేజీలు మెడపట్టి బయటకు నెట్టేస్తున్నయి. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నరు కదా?... పేద విద్యార్థుల కోసం రూ.8 వేల కట్టలేరా? కాలేజీలు బంద్ అయితే విద్యార్థులు ఎటు పోవాలి? ఏం చదువుకోవాలి? వాళ్ల భవిష్యత్తును రోడ్డున పడేస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? కాలేజీ యాజమాన్యాలకు ఆనాడే చెప్పిన’’ అని అన్నారు. తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా.

ఆరోగ్యశ్రీది అదోగతే..

‘‘పేదోడు తెలంగాణలో బతకాలంటే భయమైతుంది. రోగమొస్తే కూడా పట్టించుకునే నాథుడే లేకపాయే... ఆరోగ్యశ్రీ పథకం కూడా మాదేనని జబ్బలు చర్సుకున్న కాంగ్రెసోళ్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోవడంతో రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రానీయ్యడం లేదు. ఆరోగ్యశ్రీ పైసలియ్యనిదే ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టనిచ్చేదే లేదని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులోళ్లు తెగేసి చెబుతున్నరు. పోనీ సర్కారు దవాఖానాకైనా పోదామంటే సూది లేకపాయే, మందు బిళ్లలు కూడా లేకపాయే. మరి ఏం చేయాలే.... పేదోడికి రోగమొస్తే చావాల్సిందేనా? ఇందుకోసమేనా? కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించింది? ప్రజా సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందించవు. ఏమైనా అంటే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం అంటూ రచ్చ చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నయ్’’ అని విమర్శించారు.

Read More
Next Story