
‘జూబ్లీ ఎన్నిక ముస్లింలకు, హిందువులకు మధ్యే’
జూబ్లీహిల్స్‌లో ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది హిందువులు, ముస్లింల మధ్యే జరుగుతుందంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నికలో అసలు పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యేననీ అన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఉపఎన్నికలో భాగంగా రహమత్ నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అందుకోసం తాను కంప్లెయింట్ ఇస్తున్నానని అన్నారు. దమ్ముంటే రేవంత్.. విచారణ జరిపించాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా 80శాతం ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి తమ సత్తా చాటాలని పిలుపిచ్చారు.
మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేయడానికి కేటీఆర్, రేవంత్‌ను పన్నాగాలు పన్నుతున్నారంటూ తీవ్ర ఆరోపనలు చేశారు బండి సంజయ్. అందుకే ఫిర్యాదు చేసినా మాగంటి మరణంపై విచారణ చేయపట్టడంలేదన్నారు. ‘‘సీఎం రేవంత్‌కు చీము, నెత్తురు, రోషం, పౌరుషం అనేవి ఇసుమంత ఉన్నా సరే గోపీనాథ్ మరణంపై విచారణ చేయించాలి. గోపి ఆస్తుల కోసం దొంగ నాటకాగాలు ఆడుతున్నారు. అందులో భాగంగానే సునీతకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఈ వాస్తవాలు చెప్తన్నందుకే నన్ను మతతత్వవాది అంటున్నారు. మతం పేరుతో నిజాలను తప్పుదారి పట్టించాలుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
జూబ్లీపోటీ హిందువులు, ముస్లింల మధ్యే..
‘‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అసలు పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే. హిందువులు, ముస్లింల మధ్యే ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలారా.. మీకు తురకోళ్ల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండి. హిందుత్వ వాదులారా గడగడపకు తిరిగి ఓట్లు అడగండి’’ అని కోరారు.
ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి..
‘‘షేక్‌పేటలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. ఒక్కో ఓటుకు రూ.10వేలు ఇవ్వానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు తురకోళ్లకే కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అసలు జూబ్లీహిల్సే లేదు. ఇక్కడ ఉన్నవన్నీ బస్తీలు, మురికివాడలే. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్‌ను ఏం చేశారు? వాళ్లు చేసింది శూన్యం. ముదతల చొక్కా, రబ్బరు చెప్పులు వేసుకునే కేటీఆర్‌కు ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అని ప్రశ్నించారు.
48 గంటలే సమయం.. తేల్చుకోండి..
‘‘గోదావరఖనిలో 46 మైసమ్మ గుడులను కూల్చేశారు. వాటిని పునర్మించడానికి 48 గంటలే టైమ్. ఆ లోపు తిరిగి కట్టకపోతే కూల్చిన వారి సంగతి చూస్తాం. పోలింగ్ తర్వాత నేనే గోదావరిఖని వెళ్తా.. మసీదులను కూల్చివేయిస్తా. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంట.. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంట.. సీఎం రేవంత్ చెప్తున్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను చంపుతానన్న ఒవైసీని సంకనేసుకుని తిరుగుతున్నాడీ సీఎం. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పార్కులన్నీ ఖబరస్తాన్‌లు అవుతాయ్. మీ ఇండ్ల ముందే రక్తం ఏరులై పారతది. మొలతాడు లేనోడికే అంత పౌరుషం అయితే మొలతాడు ఉన్న మనకెంత ఉండాలి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి.

