‘ఒవైసీ ఓ అజ్ఞాని’.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
x

‘ఒవైసీ ఓ అజ్ఞాని’.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ఒవైసీపై బండి సంజయ్ విమర్శలు చేశారు. ఇన్నాళ్లూ ఎంఐఎం పార్టీ గెలుస్తున్నా.. పాతబస్తీ ఇంకా బస్తీగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఒవైసీ వేల ఎకరాలు కబ్జా చేశారన్నారు.


వక్ఫ్ బోర్డ్‌లో ఇతర మతాల వారిని అనుమతించడం అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ముస్లిం పెద్దలు దీన్ని ససేమిరా ఖండిస్తుంటే.. అందులో తప్పేముంది అని ఇతరులు అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. దీనిని తీవ్రంగా ఖండించారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డ్‌లోకి ఇతర మస్తులను ఎలా అనుమతిస్తారని, అది సరైన నిర్ణయం కాదని అన్నారు. వక్ఫ్ బోర్డులో అన్యమతస్తులకు స్థానం కల్పించడం ముస్లింలను అవమానించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీటీ) బోర్డులో ఇతర మతస్తులను నియమించిన క్రమంలో వక్ఫ్ బోర్డులో మాత్రం అన్యమతస్తులను ఎలా నియమిస్తారని ఒవైసీ ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అయితే తాజాగా ఈ అంశంపై, ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ ఘాటుగా మాట్లాడుతున్నారు. ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒవైసీకి టీటీడీ, వక్ఫ్‌బోర్డుకు మధ్య తేడా కూడా తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే ఒవైసీ అసలు రంగు ఇప్పటికి బయటపడిందని, అందుకు టీటీడీ, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే నిదర్శనమని మండిపడ్డారు.

ఆ మాత్రం తెలియదా ఒవైసీ..

‘‘వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూముల వ్యవహారాలకు సంబంధించినది. అయినా వక్ఫ్ బోర్డుతో సాగుతున్న భూ దందాకు టీటీడీకి లింక్ పెడతారా? వక్ఫ్ బోర్డు సొంతం చేసుకున్న భూములు పేదలకు దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చింది. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్‌తో పదేళ్లు అంటకాగిన ఎంఐఎం ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. కలియుగ దైవానికి వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీటీడీకి కబ్జా తెలీదు..

‘‘టీటీటీడి కబ్జా అంటే ఏంటో తెలియదు. విరాళాలతో హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేయడమే తెలుసు. టీటీటీ ఏనాడూ కూడా ప్రజల ఆస్తులను కబ్జా చేయలేదు. ఒవైసీ దృష్టిలో భగవంతుడు అంటే వ్యాపారమే. వేల ఎకరాలను కబ్జా చేశారు. కాలేజీలు ఆసుపత్రులు కట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఒవైసీ మాటలు నమ్మి మోసపోతున్న పాతబస్తీ ముస్లిం పోదరులకు చెప్తున్నది ఒకటే. ఇకనైనా తెలుసుకోండి. మజ్లిస్ గెలుస్తున్నా పాతబస్తి ఎందుకు అభివృద్ధి చెందలేదు? న్యూసిటీ, సైబరాబాద్ లా ఎందుకు అవ్వట్లేదు’’ అని ప్రశ్నించారు.

Read More
Next Story