తెలుగు సినీ ఇండస్ట్రీ గాలి తీసేసిన బండ్ల గణేష్
x
Revanth and Bandla Ganesh

తెలుగు సినీ ఇండస్ట్రీ గాలి తీసేసిన బండ్ల గణేష్

రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లోని ప్రముఖుల వ్యవహారశైలిపై బండ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖల గాలిని బండ్ల గణేష్ తీసేశారు. బండ్ల తెలుగుసినీ పరిశ్రమలో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఉంటూనే బండ్ల గణేష్(Bandla Ganesh) నిర్మాతగా ఎదిగాడు. గడచిన ఐదేళ్ళుగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ(Telangana Congress Party)లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి వీరాభిమాని అనే చెప్పాలి. ఇపుడు విషయం ఏమిటంటే శుక్రవారం రేవంత్ పుట్టినరోజు జరిగింది. తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ మూసీనది(Musi River Project) పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి పాదయాత్ర కూడా చేశారు. (Yadagiri gutta)యాదగిరి గుట్ట దేవాలయంలో కుటుంబంతో పాటు కలిసి పూజలు చేసిన తర్వాత సంగెం బ్యారేజి నుండి రెండు విడతలుగా మూసీనది వెంబడి రేవంత్ పాదయాత్ర(Padayatra) చేశారు. ఈ విషయం అంతా అందరికీ తెలిసిందే.

ఇపుడు అసలు విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లోని ప్రముఖుల వ్యవహారశైలిపై బండ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకంటే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎవరూ రేవంత్ కు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదట. సినిమా విడుదల సందర్భంగా టికెట్ల రేట్లు పెంచుకోవటానికి మాత్రమే సినీ ప్రముఖులకు రేవంత్ గుర్తుకొస్తారు కాని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పరా ? అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి నమస్కారం...చెప్పనివారికి పెద్ద నమస్కారం అంటు సెటైర్లు వేశారు. ఇపుడు బండ్ల అన్నాడని కాదుకాని మొదటినుండి రేవంత్ అంటే ఎందుకనో సినీ ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖుల్లో చిన్నచూపు ఉన్నది మాత్రం వాస్తవం. నంది అవార్డుల స్ధానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని రేవంత్ ప్రకటించినపుడు కూడా సినీ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు.

రేవంత్ సీఎం అయినపుడు కూడా చాలామంది పట్టించుకోలేదు. రాజకీయాలతో సంబంధంలేకుండా సినీపరిశ్రమలోని ప్రముఖులు ముఖ్యమంత్రి అయిన నేతకు శుభాకాంక్షలు చెప్పటం చాలా సహజం. ఎందుకంటే ప్రతిరోజు సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వంతో ఏదో పని ఉంటూనే ఉంటుంది. అందుకనే రాజకీయాలతో సంబంధంలేకుండా వ్యక్తులతో పనిలేకుండా ముఖ్యమంత్రితో అందరు మంచి సంబంధాలనే కోరుకుంటారు. కాని ఎందుకనో ఏపీలో జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి అయినపుడు కూడా చాలామంది శుభాకాంక్షలు చెప్పలేదు. సరే తాముండేది హైదరాబాదులో కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నారని చాలామంది సర్దిచెప్పుకున్నారు. అయితే మరి తెలంగాణాకు రేవంత్ సీఎం అయినపుడు కూడా ఎందుకని చాలామంది ప్రముఖులు స్పందించలేదో అర్ధంకాలేదు. గద్దర్ అవార్డుల ప్రకటన విషయంలోనే కాదు చివరకు పుట్టినరోజుకు కూడా సినీ ప్రముఖుల్లో చాలామంది రేవంత్ కు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.

విచిత్రం ఏమిటంటే తాము తీసిన సినిమాలు విడుదల అవుతున్నదంటే నిర్మాతలు, డైరెక్టర్లు రేవంత్ రెడ్డి ముందు క్యూ కడతారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిని కోరుతు నిర్మాతలు, డైరెక్టర్లు ప్రభుత్వం చుట్టూ తిరగటం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్నే బండ్ల తాజా ట్వీట్లో డైరెక్టుగానే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను నిలదీస్తు గాలి తీసేసింది.

Read More
Next Story