పోటీ పక్కనపెట్టి పెళ్లిపీటలెక్కిన బర్రెలక్క
x

barrelakka marriage

పోటీ పక్కనపెట్టి పెళ్లిపీటలెక్కిన బర్రెలక్క

అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన బర్రెలక్క అలియాస్ శిరీష వివాహం గురువారం ఘనంగా జరిగింది.


అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన బర్రెలక్క అలియాస్ శిరీష వివాహం గురువారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుగణం, స్నేహితుల మధ్యన శిరీష అయినవాడితో కలిసి ఏడడుగులు వేసింది. గత కొంతకాలంగా ఆమె వివాహంపై రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో ఆమె పెళ్లి ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. వీటన్నిటికీ చెక్ పెడుతూ బంధువుల అబ్బాయి వెంకటేష్ తో ఆమె పెళ్లి సంబురంగా జరిగిపోయింది.

ఇటీవల తనకి పెళ్లి కుదిరిందని సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఫోటోలను శిరీష షేర్ చేసింది. తనకి కాబోయే వాడు ఫలానా ఫలానా అంటూ యూట్యూబ్ చానళ్ళు ఊహాగానాల భాజాభజంత్రీలు వాయించేశాయి. కానీ ఆమె సమీప బంధువుల అబ్బాయిని పెళ్లాడింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్ లో శిరీష, వెంకటేష్ ల వివాహం జరిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.

హాయ్ ఫ్రెండ్స్.. బర్రెలు గాయనీకి వచ్చిన ఫ్రెండ్స్, డిగ్రీలు డిగ్రీలు చదివినా మెమొలొస్తున్నయ్ తప్ప జాబులైతే వస్తలేవు.. నోటిఫికేషన్లేయ్యడు.. అందుకే మా అమ్మనడిగి నాలుగు బర్రెలు గొన్న, పొద్దున్న మూడు లీటర్లు, సాయంత్రం మూడు లీటర్లు.. రోజుకు మూడొందలు ఎక్కడికి పోవు ఫ్రెండ్స్ అంటూ... నిరుద్యోగుల సమస్యని అందరినీ ఆకట్టుకునేలా వీడియో ద్వారా తెలిపింది. ఈ వీడియో బాగా వైరల్ అవడంతో ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

ఆ ఇమేజ్ తో నిరుద్యోగుల గొంతు అసెంబ్లీలో వినిపిస్తానంటూ కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమెపై, కుటుంబ సభ్యులపై దాడులు జరిగినప్పటికీ పోటీ నుంచి వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు వంటి ఉద్దండులపై పోటీ చేసింది. కానీ ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితేనేం లక్షల మంది మనసులు గెలిచింది. అదే కాన్ఫిడెన్స్ తో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలు సమీపించినా ఈ విషయంపై బర్రెలక్క ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read More
Next Story