
తెలంగాణ కోర్టు ముందు తీవ్ర ఆందోళనలు..
గేట్ నెం.7 దగ్గర తీవ్ర స్థాయిలో నినాదాలు.
తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ 7 దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ రిజర్వేషన్లను అందిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.9పై సీజే అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహుయిద్దీన్‌లతో కూడిన ద్వసభ్య ధర్మాసనం స్టే విధించింది. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు ఉన్నత న్యాయస్థానం దగ్గర తీవ్ర ఆందోళనలు చేపట్టారు. బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. అయితే ఎవరూ భయపడాల్సింది లేదని, అందరూ ధైర్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
‘‘కొందరు కావాలనే బీసీలను అయోమయంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలతంగాణలో బీసీల జనాభా 60 శాతం ఉంది. హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరుపున 42 శాతం రిజర్వేషన్లపై బలమైన వాదనలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో మేమెంతో.. మాకంత.. జనాభా ప్రకారం వాటా దక్కాల్సిందే. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తాం’’ అని స్పష్టం చేశారు.