‘బీసీ రిజర్వేషన్లలో అది కుదరదు’
x

‘బీసీ రిజర్వేషన్లలో అది కుదరదు’

ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌ తీసివేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.


బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేశారని, సాధ్యం కాదని తెలిసినా కావాలనే కంటితుడుపు చర్యగా బిల్లు తీసుకొచ్చారని ఆయన అన్నారు. అసాధ్యం కాదని అంతా తెలిసిపోతుండటంతో ఇప్పుడు నిందను బీజేపీపై తోసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ కోసం మోసం చేస్తున్నారు. మీకు న్యాయ సలహాదారులు లేరా?ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌ తీసివేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లింలకు ఇచ్చినవి రాజకీయ రిజర్వేషన్లు.. అందుకే వ్యతిరేకిస్తున్నాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లోకి తీసుకురాలేం. దానికి సుప్రీంకోర్టు అనుమతించదు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.

Read More
Next Story