KTR and Kavitha|కేటీఆర్, కవితకు బీసీల ఫిట్టింగ్
x
KTR and Kavitha

KTR and Kavitha|కేటీఆర్, కవితకు బీసీల ఫిట్టింగ్

2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన దగ్గరనుండి కేటీఆర్, కవితలు పదేపదే బీసీ మంత్రాన్ని జపిస్తున్న విషయం అందరు చూస్తున్నదే.


కొద్దిరోజులుగా బీసీ మంత్రం జపిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు కొందరు బీసీల నేతలు కరెక్టు ఫిట్టింగ్ పెట్టారు. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన దగ్గరనుండి కేటీఆర్, కవిత(KTR and Kavitha)లు పదేపదే బీసీ మంత్రాన్ని జపిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. తమపాలనలో బీసీలకు బ్రహ్మరథం పట్టామని, త పాలనలోనే బీసీలు అన్నీవిధాలుగా డెవలప్ అయ్యారని ప్రతిరోజు ఒకటే ఊదరగొడుతున్నారు. అన్నా, చెల్లెళ్ళు మాట్లాడుతు స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) బీసీలకు 42 శాతం(BC Reservations) రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని, కార్పొరేషన్ల భర్తీలో బీసీలకు జనాభా దామాషా పద్దతిలో ప్రధాన్యత ఇవ్వాల్సిందే అని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కవిత పదేపదే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి ఆలోచన ఏమిటంటే బీసీ సమాజాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే.

ఇక్కడే కొందరు బీసీ నేతలు అన్నా, చెల్లెళ్ళ వైఖరిపై ఎదురుదాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీసతీష్ మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీనేతకు ఇస్తారా ? అని చాలెంజ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి వెంటనే కేటీఆర్ రాజీనామాచేసి ఆ స్ధానంలో బీసీనేతను కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. గౌరీ డిమాండు ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ బీసీ నేతను నియమిస్తారా ? లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రాజీనామాచేసి తనప్లేసులో బీసీనేతను ఎంపికచేయమని పార్టీఅధినేత కేసీఆర్(BRS chief KCR) కు సిఫారసుచేయగలరా ? అలాగే కాంగ్రెస్ వేములవాడ ఎంఎల్ఏ ఆదిశ్రీనివాస్ మాట్లాడుతు స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ తగ్గించిందే కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల కోటాను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది కేసీఆరే అని ఎంఎల్ఏ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వర్తింపచేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్న అన్నా, చెల్లెళ్ళు తమహయాంలో రిజర్వేషన్ను 34 నుండి 22 శాతానికి ఎందుకు తగ్గించారో ముందు సమాధానం చెప్పాలని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

ఇక కవితగురించి మాట్లాడుతు అధికారంలోఉన్న పదేళ్ళల్లో అసెంబ్లీలో జ్యోతీరావుపూలే(Jyoti rao Pule) విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోఉన్నపుడు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయటానికి ఎవరైనా అడ్డుపడ్డారా అని పైనేతలు కారుపార్టీ కీలకనేతలను నిలదీస్తున్నారు. వీళ్ళుఅడిగారని కాదుకాని అధికారంలో పదేళ్ళు పూలేవిగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయాలని కవితకు ఒక్కసారి కూడా అనిపించలేదు. ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చారో వెంటనే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయాలని నానా గోలచేస్తున్నారు. అధికారంలోఉన్నపుడు పూలేవిగ్రహాన్ని అసెంబ్లీలో ఎందుకు ఏర్పాటుచేయలేదంటే మళ్ళీ సమాధానం ఉండదు. దీంతోనే అన్నా, చెల్లెళ్ళు బీసీ కార్డును ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారని అర్ధమైపోతోంది.

3వ తేదీన ఇందిరాపార్క్(Indirapark) దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అనుకున్న బీసీల సభకు కవితనాయకత్వం అవసరంలేదని ఆదిశ్రీనివాస్ అన్నారు. అసలు బీసీలకు కవితకు సంబంధంఏమిటో చెప్పాలని నిలదీశారు. బీసీలు సభపెట్టుకోవాలంటే కవిత అవసరమే లేదని ఎంఎల్ఏ కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. మరి ఆది చెప్పిందే నిజమైతే కొందరు బీసీల సంఘాల నేతలు కవితతో ఎందుకు భేటీఅయ్యారు ? కవిత నాయకత్వంలో సభ నిర్వహించటానికి ఎందుకు అంగీకరించారో ఎంఎల్ఏ సమాధానంచెప్పాలి. మొత్తానికి అన్నా, చెల్లెళ్ళ బీసీ కార్డు భవిష్యత్ రాజకీయాల్లో ఏమాత్రం పనిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story