బెజ్జోర గుడిలోని బెజ్జందేవి బసవపురాణంలోని బెజ్జమహాదేవే
x

బెజ్జోర గుడిలోని బెజ్జందేవి బసవపురాణంలోని బెజ్జమహాదేవే


దేవాలయ సందర్శనలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ గుర్తించిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లోని బెజ్జోర గ్రామం "బెజ్జందేవి"గుడిలోని శిల్పం పాల్కురికి సోమన రాసిన ‘బసవపురాణం’లోని బెజ్జమహాదేవి శిల్పమే అని రూఢీ అవుతున్నదని తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

ఒడిలో శిశువుతో అగుపించే ఈ విగ్రహం శివుణ్ణి పాపడినిచేసి మాతృవాత్సల్యంతో లాలిస్తున్న బెజ్జమహాదేవినే దేవతగా గుడిలో ప్రతిష్టించారు. అరుదైన చారిత్రక సంఘటన. వీరశైవభక్తుల శిల్పాలలో అక్కమహాదేవి విగ్రహం ప్రసిద్ధమైంది.
చాళుక్యశైలి గుడిలో కనిపించే మరొక దేవతాశిల్పం చాముండిది. ఇంకొకటి శైవభక్తునిది. దేవాలయంలో రెండుశైలుల గణపతులు, ఒక షణ్ముఖుడు, రెండుశైలుల శివలింగాలు, ఒక లింగం వెనక కనిపిస్తున్న లగుడధారి పాశుపతుడో, కాలాముఖశైవగురువో కావాలి. గుడికి అనుబంధంగా మెట్లబావి వుందని ఆయన చెప్పారు.

Read More
Next Story