రుణమాఫీ జోరుకు బ్రేక్ ?
x
farmer loan waiver

రుణమాఫీ జోరుకు బ్రేక్ ?

ఇపుడు రెండో విడత రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినట్లు సమాచారం.


ఈనెలాఖరులోగా రెండోవిడత రైతు రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే లబ్దిదారుల జాబితాలను రైతులు రుణాలు తీసుకున్న 32 బ్యాంకులకు పంపిచింది. నిధుల సేకరణలో కూడా సీరియస్ గా కసరత్తుచేస్తోంది. ఈనెల 31వ తేదీలోగా రెండో విడత రుణమాఫీ చేయబోతున్నట్లు గతంలోనే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేవంత్ ఇదే ప్రకటనచేశారు. 31వ తేదీలోగా రెండో విడత రుణమాఫీ చేస్తామని, మూడో విడత రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోగా జరుగుతుందన్నారు. 2వ తేదీన విదేశాలకు వెళుతున్న తాను 12వ తేదీన తిరిగిరాగానే రు. 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

పైన చెప్పిందంతా గతంలోనే ప్రభుత్వం పెట్టుకున్న షెడ్యూల్. మూడు క్యాటగిరీల్లోని సుమారు 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే రు. 31 వేలు కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి విడత రుణమాఫీకి రు. 6070 కోట్లను మంజూరుచేసింది. రెండో విడత రుణమాపీకి రు. 8 వేల కోట్లు అవసరమవుతాయని, మూడో విడత మాఫీకి సుమారు 17 వేల కోట్లరూపాయలు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. అయితే ఇపుడు రెండో విడత రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినట్లు సమాచారం. రుణమాపీ కోసం ఉన్నతాధికారులు నిధుల సేకరణకు మార్గాలను వెతుకుతున్నారు. ఆ సమయంలో ఎన్సీడీసీని(నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్) కూడా అప్పు కావాలని అడిగారు. అప్పట్లో ప్రభుత్వం అడిగిన అప్పులో రు. 5 వేల కోట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎన్సీడీసీ చెప్పింది.

ఎన్సీడీసీ హామీతో రుణమాఫీ కసరత్తులో జోరుపెరిగింది. అదే సమయంలో అనేక మార్గాల్లో నిధులను సేకరించిన ప్రభుత్వం మొదటి విడత నిధులు మంజూరుచేసింది. రెండో విడత రుణమాఫీకి ఎన్సీడీసీ ఇస్తానన్న నిధులను ఉపయోగించుకోవాలని జూలై 31వ తేదీని రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలకు డెడ్ లైన్ గా ప్రకటించింది. అయితే సడెన్ గా ప్రాబ్లెమ్ ఎందురైంది. ఎలాగంటే నిధులు ఇస్తాము కాని రుణమాఫీకి ఉపయోగించేందుకు లేదని మెలికపెట్టింది. తమ దగ్గర తీసుకున్న రు. 5 వేల కోట్లను సహకార సంఘాలు, జిల్లా సహకార బ్యాంకుల వ్యవస్ధను బలోపేతం చేయటం కోసమే ఉపయోగించాలని స్పష్టంగా షరతు విధించినట్లు సమాచారం. పైగా తాము మంజూరుచేసిన నిధుల ఉపయోగంపై ఎప్పటికప్పుడు తాము ఆడిట్ చేస్తామని అందుకు ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పకూడదనే షరతు కూడా విధించింది.

రుణమిచ్చేసి తర్వాత ఎప్పుడో తనిఖీలు చేస్తామని, ఆడిట్ చేస్తామంటే ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించేసుకుంటాయనటంలో సందేహంలేదు. ఎన్సీడీసీ తనిఖీలు, ఆడిట్ కు వచ్చినపుడు ఏదోలా నిధులను అర్జంటుగా సర్దుబాబు చేయచ్చని ప్రభుత్వాధికారులు అంచనా వేశారు. కాని ఇపుడు విధించిన షరతులతో ఎప్పుడైనా సరే తమిష్టంవచ్చినపుడు తనిఖీలు, ఆడిటింగులు చేస్తామని చెప్పటంతో ప్రభుత్వానికి సమస్య మొదలైంది. సహకార సంఘాల బలోపేతం, జిల్లా సహకార బ్యాంకుల వ్యవస్ధ బలోపేతానికి నిధులిచ్చిన ఎన్సీడీనీ ఖర్చులు పెడుతున్న విషయమై వెంటనే తనిఖీలు మొదలుపెడితే ప్రభుత్వానికి సమస్యలు తప్పవు. ఇప్పటికిప్పుడు అర్జంటుగా రు. 5 వేల కోట్లను ఎలా సర్దుబాటు చేయాలన్నదే ప్రభుత్వానికి సమస్యగా మారింది. షరతుల విషయంలో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు ఎన్సీడీసీ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. డెడ్ లైనుకు ఉన్నది రెండురోజులు మాత్రమే. ఇంత తక్కువ వ్యవధిలో రు. 5 వేల కోట్లు సమీకరించటం కష్టమే. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.

Read More
Next Story