
మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం
మూడు ఫైరింజన్లో మంటలను ఆర్పే ప్రయత్నాలు
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వస్తువుల గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైరింజన్లో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఆందోళనకు గువుతున్నారు. కాగా ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. గోడౌన్ కొన్ని నెలలుగా మూతబడి ఉందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు లేవని భావించిన అధికారులు అసలు మంటలు ఎలా చెలరేగాయి అన్న అంశంప ఫోకస్ పెట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Next Story