ఫిరాయింపు ఎంఎల్ఏల కీలక నిర్ణయం
x
BRS defection MLAs

ఫిరాయింపు ఎంఎల్ఏల కీలక నిర్ణయం

స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు మరింత సమయం కావాలని అడగాలని డిసైడ్ చేసినట్లు సమాచారం


ఫిరాయింపు ఎంఎల్ఏ వ్యవహారంలో బిగ్ ట్విస్టు చోటుచేసుకుంది. తొమ్మిదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)తో ఆదివారం రాత్రి భేటీ అయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్(BRS) నుండి పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు(BRS Defection MLAs). వీరిలో స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి(Kadiyam)కి జ్వరంగా ఉన్న కారణంగా రేవంత్ భేటీలో పాల్గొనలేదు. వీరందరిపైన అనర్హత కత్తి వేలాడుతున్న నేపద్యంలో ఈ భేటి జరగటం సంచలనంగా మారింది. కేటీఆర్-ఫిరాయింపు ఎంఎల్ఏల మధ్య వ్యవహారం ‘టామ్ అండ్ జెర్రీ’ టీవీ షోలాగ తయారైంది.

ఇంతకీ భేటీలో ఏమి జరిగిందంటే స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు మరింత సమయం కావాలని అడగాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. సుప్రింకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎంఎల్ఏలందరికీ నోటీసులు జారీచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు వేర్వేరుగా కేసులు దాఖలుచేశారు. ఈ కేసులను విచారించిన సుప్రింకోర్టు మూడు మాసాల్లో ఫిరాయింపులపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో తనకు చెప్పాలని స్పీకర్ ను ఆదేశించింది.

దాని ఫలితంగానే ఫిరాయింపు ఎంఎల్ఏలకు స్పీకర్ నోటీసులు జారీచేస్తున్నారు. పదిమంది ఎంఎల్ఏల్లో ఎంతమందికి నోటీసులు అందాయన్న విషయంలో క్లారిటిలేదు. గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ కు నోటీసులు అందినట్లు వారే స్వయంగా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని ఈ ఎంఎల్ఏలు అంటున్నారు. తాము పార్టీ ఫిరాయించామని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని చెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము రేవంత్ ను కలిసినట్లు చెబుతున్నారు. ఇదేవిషయాన్ని స్పీకర్ కు పంపిన సమాధానంలో బండ్ల స్పష్టంచేశారు.

ఇక మిగిలిన ఎంఎల్ఏలు నోటీసులకు ఏమని సమాధానాలు ఇస్తారో చూడాలి. ఈ నేపధ్యంలోనే సమాధానాలు ఇవ్వాల్సిన ఎంఎల్ఏలు మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరాలని డిసైడ్ చేశారు. వీరికి అవసరమైన న్యాయసలహాలు ఇచ్చేందుకు అడ్వకేట్ జనరల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. నోటీసులకు సమాధానాలు ఇవ్వటానికి ఎంత గడువు కోరబోతున్నారన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. వీరి రిక్వెస్టును స్పీకర్ ఆమోదిస్తారా అన్నది తెలీదు. ఎందుకంటే ఇప్పటికే వీరి వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రింకోర్టు స్పీకర్ కు మూడునెలల గడువు విదించింది. మరో నెలన్నర అయితే గడువు పూర్తవుతుంది. మూడునెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రింకోర్టు ఏ విదంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ఈవిషయాలను గ్రహించే సుప్రింకోర్టులో మరోసారి కేసులు వేయాలని కేటీఆర్ నిర్ణయించింది. నోటీసులు, సమాధానాలు, మళ్ళీ నోటీసులు, మళ్ళీ సమాధానాల పేరుతో ఫిరాయింపులు కాలయాపన చేస్తారనే అనుమానం కేటీఆర్ కు వచ్చినట్లుంది. అందుకనే మరోసారి సుప్రింకోర్టులో కేసులు వేయబోతున్నట్లు కేటీఆర్ చెప్పింది. మరి తాజా భేటీలో తీసుకున్న నిర్ణయం పర్యవసానాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.

Read More
Next Story