జగన్ కు ఎంపీ మేడా షాక్
x

జగన్ కు ఎంపీ మేడా షాక్

అమ్మతోడు..వైసీపీలోనే ..అంటూ ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మేడా మాటలు...మనస్సులో ఏముందో?


వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాధరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిశారు. ఎక్కడో ఎదురు పడితే మాట్లాడటం కాదు స్వయంగా ఖర్గే నివాసానికి వెళ్లి కలిశారు. క్షేమ సమాచారాలు కనుక్కున్నారు.మరి ఈ విషయాన్ని ఆయన తేలిగ్గా తీసిపారేస్తున్నా ,ఏపీ రాజకీయాలలో మాత్రం పెద్ద చర్చకే దారితీసింది.వైసీపీ ఎంపీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలవడం తో ఏపీ కాంగ్రెస్ వర్గాలను అయితే ఖుషీ చేస్తోంది.రాష్ట్రంలో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ లోకి ఒక ఎంపీ వచ్చి చేరుతున్నారన్న ప్రచారాన్ని కొందరు మొదలు పెట్టారు.కాంగ్రెస్ శ్రేణులు ఇలా సంతోషం వ్యక్తం చేస్తుంటే ,మేడా వైసీపీకి అధినేత జగన్ కు షాక్ ఇస్తున్నారా? అన్న ప్రచారం మరోపక్క జోరుగా సాగుతోంది.

జాతీయ రాజకీయాలు ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ కి పోటీగా కాంగ్రెస్ ఆధ్యర్యం లోని ఇండియా కూటమి తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని రంగంలో దింపింది.అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్ లు తమ కూటమిలో లేని పార్టీల ఎంపీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి.వైసీపీ కూడా తమ పార్టీ మద్దతు ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ కే ఉంటుందని స్పష్టం చేసింది.ఈ సమయంలో మేడా రఘునాధ్ రెడ్డి కాంగ్రెస్ జాతీయఅధ్యక్షుడిని కలవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమైంది.దాంతో పాటు మేడా వైసీపీన వీడుతున్నారన్న రాజకీయ ప్రచారం కూడా ఊపందుకుంది.
ఇప్పటికే నలుగురిని కోల్పోయిన వైసీపీ
వైసీపీకి కి వున్న 11 మంది రాజ్యసభ సభ్యులలో ఇప్పటికే నలుగురు రాజీనామా చేశారు.ఖాళీ అయిన ఆ స్థానాలకు ఎన్నికలు జరిగిపోవడం అందులో రెండు తెలుగుదేశం, మరో రెండు బీజేపీ పచుకొని గెల్చుకున్నాయి కూడా కాబట్టి ప్రస్తుతం వైసీపీకి 7 గురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వున్నారు.అందులో వైఎస్ జగన్ సొంత జిల్లా కడపకే చెందిన మేడా రఘునాధరెడ్డి ఒకరు .నలుగురు సభ్యులను వదులుకున్న క్రమంలోనే మేడా వ్యవహారం వుంటుందా అన్న చర్చ సాగుతోంది. అయితే జగన్ కు సన్నిహితుడుగా సొంత జిల్లాకే చెందిన వాడుగా మేడా అలాంటి నిర్ణయం తీసుకోబోరని , అన్నజగన్ వెంటే వుంటారని , వైరి వర్గం అనవసర ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.
మర్యాదపూర్వక భేటీనే..మేడా
కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఖర్గేను తాను క‌ల‌వ‌డంపై వైసీపీ ఎంపీ మేడా స్పందించారు. "నేను కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌కంగానే ఖ‌ర్గేను క‌లిశాను. ఆయ‌న క‌ర్ణాట‌క హోంమంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి నాకు ప‌రిచ‌యం ఉంది, ఆ ప‌రిచ‌యం మేర‌కు ఇప్పుడు క‌లిశాను "అని వెల్ల‌డించారు. ఇది స్నేహ‌పూర్వ‌క స‌మావేశం మాత్ర‌మేన‌ని, దీనిపై అత్యుత్సాహం చూపించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దీనికి రాజ‌కీయాలు ఆపాదిస్తూ వ‌క్రీక‌రించ వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. "గ‌తేడాది కాలంగా ప‌లుమార్లు ఇలాంటి ప్ర‌చారాలు చేశారు,నేను వైసీపీ పార్టీ ఎంపీనే,నా ప్ర‌యాణం జ‌గ‌న్ వెంటే" న‌ని ర‌ఘునాథ‌రెడ్డి స్పష్టం చేశారు.
మేడా అంత చెబుతున్నా, ఏపీ రాజకీయాలలో మాత్రం చర్చ మాత్రం ఆగడం లేదు.ఎక్కడో కనిపిస్తే మాట్లాడితే సరి , ఉపరాష్ట్ర పతి ఎన్నిక సందర్భంలో ఇంటికి వెళ్లి కలుస్తారా.. వైసీపీ ఎపీల ఓట్లు ఎన్డీఏకు పడితే , మేడా ఒక్క ఓటు మాత్రం ఇండియా కూటమి అభ్యర్ధికి దక్కుతుందేమో అన్న సెట్లైర్లు వేస్తున్నారు.ఏదైనా జగన్ తో చెప్పి మరీ వెళ్లి ఖర్గేను కలిశారేమో చూడాలి.
Read More
Next Story