జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. లంకల దీపక్‌కు బీజేపీ మరో ఛాన్స్..
x

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. లంకల దీపక్‌కు బీజేపీ మరో ఛాన్స్..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ తరుపున లంకల దీపక్ పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది.


జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మూడు పార్టీలో తమ గెలుపు గుర్రాలను నిలబెడుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపపథ్యంలో తన అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లంకల దీపక్‌కు అవకాశం ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ తరుపున లంకల దీపక్ పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లంకల దీపక్.. బీజేపీ తరుపున పోటీ చేశారు. కాగా ఆ ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఉపఎన్నికకు మళ్ళీ దీపక్‌నే ఎన్నుకోవడంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్‌కు 80,175 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలో లంకల దీపక్ సుమారు 26వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం కావడంతో.. దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లను బీజేపీ పరిశీలించింది. చివరకు మరోసారి దీపక్‌ను ఖరారు చేసింది. అయితే లంకల దీపక్.. బుధవారమే తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలో బీజేపీ తరుపున లంకల దీపక్, కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరుపున మాగంటి సునీత బరిలో ఉణ్నారు. వీరి మధ్య హోరాహోరీ పోటీ జరగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సునీత తొలిసారి ఎన్నికలో నిల్చుకుంటున్నా.. ప్రస్తుతం బీఆర్ఎస్ సింపతీ గేమ్ ఆడుతున్నందున ఆమెకు అవకాశం అధికంగానే ఉందని, మాగంటి గోపీనాథ్‌పై అభిమానంతో ఆమె వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నవీన్ యాదవ్, లంకల దీపక్‌కు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉన్నందున వారి మధ్య పోటీ బలంగానే ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Read More
Next Story