25 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఖరారు..
x

25 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఖరారు..

తెలంగాణలో పలు జిల్లాల పార్టీ అధ్యక్షుల విషయంలో బీజేపీ తుది నిర్ణయం తీసుకుంది. జిల్లా పార్టీ పగ్గాలను ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చింది.


తెలంగాణలో పలు జిల్లాల పార్టీ అధ్యక్షుల విషయంలో బీజేపీ తుది నిర్ణయం తీసుకుంది. కార్యకర్తలు, నేతల అభిప్రాయ సేకరణ తర్వాత జిల్లా పార్టీ పగ్గాలను ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో 25 జిల్లాలకు తమ పార్టీ అధ్యక్షులకు ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. వీటిలో బీసీలకు 15 చోట్ల అవకాశం కల్పించింది బీజేపీ. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది. ఎస్సీలను రెండు చోట్ల అధ్యక్షులుగా నియమించింది. 27 జిల్లాల్లో ఒకే ఒక చోట మహిళకు అవకాశం లభించింది.

బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరే

  1. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా - లంకల దీపక్ రెడ్డి..
  2. భువనగిరి - అశోక్ గౌడ్
  3. జనగామ - చౌడా రమేష్..
  4. నల్గొండ - వర్షిత్ రెడ్డి..
  5. మేడ్చల్ - బి.శ్రీనివాస్..
  6. సిద్దిపేట - మోహన్ రెడ్డి..
  7. గోల్కొండ - ఉమామహేందర్
  8. హన్మకొండ - సతీష్ రెడ్డి
  9. భాగ్యనగర్ - శేఖర్ చంద్ర..
  10. సికింద్రాబాద్ - భారత్ గౌడ్
  11. నిజామాబాద్ - దినేష్..
  12. జగిత్యాల - యాదగిరి
  13. వరంగల్ - గంట రవి..
  14. మహబూబ్ నగర్ - శ్రీనివాస్
  15. వనపర్తి - నారాయణ
  16. భోపాలపల్లి - నిషిదర్ రెడ్డి..
  17. ఖమ్మం - రవి కుమార్..
  18. మహబూబ్ బాద్ - వెంకటేశ్వర్లు
  19. ములుగు - బలరాం..
  20. మెదక్ - మహేష్ గౌడ్..
  21. కామారెడ్డి - రాజు..
  22. సంగారెడ్డి -గోదావరి అంజిరెడ్డి
  23. పెద్దపల్లి - సంజీవ రెడ్డి..
  24. అసిఫాబాద్ - శ్రీశైలం
  25. మంచిర్యాల - వెంకటేశ్వర్లు గౌడ్..
Read More
Next Story