హిందూ దేవాలయాలపై దాడులు.. గవర్నర్‌ను కలిసి బీజేపీ నేతలు
x

హిందూ దేవాలయాలపై దాడులు.. గవర్నర్‌ను కలిసి బీజేపీ నేతలు

తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు కాంగ్రెస్ సర్కార్ కనుసన్నల్లో జరిగాయన్న అనుమానాలను బీజేపీ నేతలు వ్యక్తం చేశారు.


తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు కాంగ్రెస్ సర్కార్ కనుసన్నల్లో జరిగాయన్న అనుమానాలను బీజేపీ నేతలు వ్యక్తం చేశారు. రోజురోజుకూ దేవాలయాలపై దాడులు అధికమవుతున్నాయని, మొన్నటికి మొన్న దసరాకు ముందు నాంపల్లి పెరేగ్ గ్రౌండ్‌లో దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం కొందరు దుండగులు చేసిన దాడిని గుర్తు చేశారు. అదే విధంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మ విగ్రహంపై దాడి జరగాన్ని బీజేపీ నేతలు ఎత్తి చూపారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, కంటితుడుపు చర్యగా మాత్రమే చర్యలు తీసుకుంటుందంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేసిన వ్యక్తిని పిచ్చోడన్న ముద్ర వేసి వదిలేయాలన్న ప్రయత్నాలు కూడా ఈ ప్రభుత్వం చేసింనది ఆరోపించారాయన. ఇదే అంశంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి పరిస్థితులను వివరించారు. తమ ఫిర్యాదు పత్రాన్ని కూడా గవర్నర్‌కు అందించారు బీజేపీ నేతలు. కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారాయన.

పోలీసుల అత్యుత్సాహం

‘‘హిందూ దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీ ఛార్జ్ చేశారు. నగరంలో జరిగిన అనేక ఉగ్రదాల్లో అమాయక ప్రజలు ఎంతో మంది బలయ్యారని, మళ్ళీ కొందరు దుండగులు అలాంటి చర్యలకే పాల్పడుతున్నారు. ఈ ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చర్యలు చేపట్టాలి. పోలీసులే మఫ్టీలో వచ్చి ర్యాలీలో దాడులు చేసేలా రెచ్చగొట్టేలా చేస్తూ లాఠీఛార్జ్ జరిగేలా చేస్తున్నారు’’ అని ఈటల రాజేందర్ వివరించారు.

దాడులను సహించేది లేదు: ఏలేటి

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలా జరిగితే భవిష్యత్తులో ఊరుకునేది లేదని, దాడులను తప్పకుండా తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. ‘‘హిందూ దేవాలయాలపై దాడి జరిగే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఖండించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం నిజాం నిరంకుశ పాలన కొనసాగుతున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే సహించేది లేదు. నిందితులపై కేసు పెట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది. హిందూ దేవాలయాలపై దాడులకు నగరంలో వందమందికి పైగానే కుట్రలు చేస్తున్నారు. దేవాలయాలపై దాడులను మా తల్లిపై దాడిలా భావిస్తాం. వాటిని ఎట్టిపరిస్థితుల్లో సహించం. కచ్ఛితంగా తిప్పికొడతాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

సమగ్ర విచారణ జరగాలి: రఘునందన్ రావు

‘‘తెలంగాణలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వం తన చర్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. పర్సనాలిటీ డవలప్‌మెంట్ పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే అంశంపై డీజీపీ జితేందర్‌ను కలిశాం. ఆలయాలపై దాడుల గురించి తెలిసినా డీజీపీ మౌనంగా ఉంటున్నారు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడిచిపెట్టాలని కోరుతున్నాం. ఇది పోలీసులకు, సమాజానికి మంచిది కాదు. రాజకీయ అవసరం కోసం హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని డైవర్ట్ చేయొద్దు. పోలీసులపై ప్రజలే దాడులు చేస్తున్నట్లు కొన్ని వీడియోలను పోలీసులు విడుదల చేస్తున్నారు. అది సరైన పద్దతి కాదు’’ అని రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story