Payal Shankar | ‘బీసీలను రాజకీయ పార్టీలు ఓట్లగానే చూస్తున్నాయి’
x

Payal Shankar | ‘బీసీలను రాజకీయ పార్టీలు ఓట్లగానే చూస్తున్నాయి’

ఒక్కసారి ఎన్నికలు పూర్తికాగానే బీసీలను మర్చిపోతున్నారంటూ పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు.


కుల గణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. ఈ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఈ నివేదిక ద్వారా రాష్ట్రంలోని ప్రతి బలహీనవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా ఈ నివేదికలో పొందుపరిచిన అంశాలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పాయల్ మాట్లాడుతూ.. బీసీలంటే రాజీకాయ పార్టీలకు ఓట్లే కనిపిస్తున్నాయని, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పార్టీలకు బీసీలు, వారి సంక్షేమం గుర్తుకొస్తుందని, ఒక్కసారి ఎన్నికలు పూర్తికాగానే బీసీలను మర్చిపోతున్నారంటూ పాయల్ శంకర్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం రాజకీయ పార్టీలు బీసీ నినాదాలు చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, రాష్ట్ర జనాభా సంఖ్యకు పోలిక లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.33కోట్లు. కుల గణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76కోట్లు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. జనాభా ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. గెలుపు అవకాశాలు లేని స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయింపులోనూ బీసీలకు అన్యాయమే జరుగుతోంది. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో బీసీ సంఘాల భవనాలకు స్థలం కేటాయిస్తున్నారు. అగ్రవర్ణాల వారి కులసంఘాల భవనాలకు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో స్థలాలు కేటాయిస్తున్నారు. బలహీన వర్గాల విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నారు. ఈ సర్వేలు బీసీ హిందువులు, బీసీ ముస్లింలు అని కొత్త పదాలు సృష్టించారు. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచడాన్ని జాప్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపును పక్కకు పెడుతోంది’’ అని పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు.

Read More
Next Story