
రఘునందన్ రావుకు మళ్ళీ బెదిరింపు..
కాసేపట్లో నీ అంతు చూస్తామంటూ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసిన ఆగంతకులు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. కాసేపట్లు హతం చేస్తామంటూ శనివారం మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు ఆగంతకులు. ఇప్పటికే మావోయిస్టుల పేరుతో రఘునందన్ రావుకు రెండుసార్లు ఫోన్లు రాగా.. వాటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శనివారం మరోసారి 7297965748 నంబర్‌తో ఫోన్ కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ గతంలో కూడా అగంతకులు రెండు నెంబర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. అయితే నెల రోజుల వ్యవధిలో రఘునందన్ రావుకు బెదిరింపులు రావడం ఇది మూడో సారి. దీంతో ఈ అంశంపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు.
Next Story