‘టార్గెట్ మహేష్’: స్టార్ట్ చేసిన బీజేపీ..
x

‘టార్గెట్ మహేష్’: స్టార్ట్ చేసిన బీజేపీ..

టీపీసీసీ చీఫ్ టార్గెట్‌‌గా విమర్శలు, ఛాలెంజ్‌స్ చేస్తున్న బీజేపీ నేతలు.


తెలంగాణ బీజేపీ నేతలంతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నాయని తాజా పరిస్థితులు. దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే విమర్శలు, ఆరోపణలు, సవాళ్లును విసురుతున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్‌చందర్ రావు, బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మహేష్ కుమార్‌ను వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గెలవడం కోసం దొంగ ఓట్లను ఆశ్రయించాల్సిన అవసరం కాంగ్రెస్‌కే ఉందంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ నేత రఘునందర్ రావు స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికకు రావాలని సవాల్ చేశారు. రఘునందర్ రావు చేసిన ఛాలెంజ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను ఒక ఊపు ఊపేస్తున్నాయి. మహేష్ కుమార్ తన బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రఘునందన్ రావు.. రాజీనామా చేసి ఎన్నికలకు రావడానికి బీజేపీ ఎంపీలంతా సిద్ధమని.. దానికి కాంగ్రస్ నాయకులు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు.

‘‘పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాల్లో మేమే గెలిచేవాళ్లం కదా. తెలంగాణలో కూడా అన్ని ఎంపీ స్థానాలను కైవశం చేసుకునేవాళ్లం. అలాంటిది మీరెందుకు 8 స్థానాల్లో గెలుస్తారు. అసదుద్దీన్ ఎలా గెలుస్తారు? దమ్ముంటే మీ 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించండి. మేము ఎనిమిది ఎంపీలం రాజీనామా చేస్తాం. కొత్త ఓటర్ లిస్ట్‌తో మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం. అప్పుడు ఎవరు ఏంటి? వాస్తవాలు ఏంటి? అనేది ప్రజలే తేలుస్తారు. బీజేపీని అడిగి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారా? కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. కాళేశ్వరంపై నిజాయితీ కమిషన్ నివేదికను ప్రజల ముందు ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే యూరయా కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చింది’’ అని రఘునందన్ అన్నారు.

Read More
Next Story