‘తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక్కటీ నెరవేరలేదు’
x

‘తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక్కటీ నెరవేరలేదు’

ప్రత్యేక తెలంగాణకు తన అనుకూలతను అందరికంటే ముందు ప్రకటించిన పార్టీ బీజేపీ.


తెలంగాణ ఏ ఒక్కరివల్లో రాలేదని, ఎందరో ఆత్మబలిదానాలతో వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన తెలంగాణ ఉద్యమం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం అహింసా పద్దతిలో సాగిందని, ప్రాణాలు కోల్పోతున్నా హింసా మార్గాన్ని ఆచరించకుండా రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని గుర్తు చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో బీజేపీ అత్యంత కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణకు తన అనుకూలతను అందరికంటే ముందు ప్రకటించింది మా పార్టీనే. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగింది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. కానీ ఆ ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవరికీ రాలేదు. ఏ ఆకాంక్షలతో తెలంగాణ కోసం ప్రజలు పోరాడారో వాటిలో ఏ ఒక్క ఆకాంక్ష కూడా నెరవేరలేదు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు రూ.10 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది’’ అని అన్నారు.

Read More
Next Story