ఆర్తనాదాలతో మిన్నంటిన సిగాచీ
x

ఆర్తనాదాలతో మిన్నంటిన సిగాచీ

తమ వాళ్ల జాడ కోసం వెంపర్లాట


సిగాచీ కంపెనీలో ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం సిగాచీ కంపెనీలో బ్లాస్ట్ జరిగి ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 మంది చనిపోయారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. తమ వాళ్లు చనిపోయిన వారిలో లేరని, కనీసం గాయాలపాలైన వారిలో కూడా లేదని బాధితులు సిగాచీ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. అయ్యా మా వాళ్లు ఎక్కడ అని అక్కడొచ్చిన వారిని అడుగుతున్నారు. కనీసం శవాలనైనా తమకు అప్పగిస్తే దహన సంస్కారాలు జరుపుకుంటామన్నారు.

పేలుడు జరిగి మూడ్రోజులు కావస్తున్నా మా వాళ్ల జాడలేదు. మృత దేహాలు పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాయని అధికారులు చెప్పడంతో అక్కడ మూడ్రోజుల నుంచి వెతికామని, గాయాలపాలైన వారిలో కూడా లేకపోవడం తమను కలచి వేస్తుందన్నారు.

హెల్ప్ డెస్క్ లో నో హెల్ప్

పాశమైలారం బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. అయితే ఈ హెల్ప్ డెస్క్ లో బాధితులను ఓదార్చేవారే కరువయ్యారు.

తమ వాళ్ల కోసం మా రక్త నమూనాలను ఇచ్చాం. అయితే అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. తమ రక్త నమూనాలకు సంబంధించిన వారు లోపల ఎవరూ లేరని చెబుతున్నారని వాళ్ల్లు రోదిస్తూ చెప్పారు. బ్రతికున్న వారిలో లేరు. చనిపోయిన వారిలో లేరు అయితే మా వాళ్లు ఎక్కడ అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇంటర్వ్యూ కోసం వచ్చి..

సోమవారం ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం సిగాచీ చేరుకున్నారు . ఆమె ఇంటర్వ్యూకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్లాస్టింగ్ సమయంలో ఆమె అక్కడే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంటర్వ్యూ కోసం అడ్మిన్ బిల్డింగ్ లోకి వెళ్లినట్టు చెప్పారు.

ఎనిమిది నెలల క్రితం పెళ్లి జరిగిన కశ్మీరా కుమారి భర్త ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాడు. ఐసీయు లో చికిత్స పొందుతున్న భర్త ఆరోగ్యం మరింత విషమించింది. బీహార్ కు చెందిన ఈ గృహిణి రోదన అక్కడున్న వారిని కలచి వేసింది.

నా భర్త రాజేశ్ కుమార్ చౌదరి సినాచీలో లేబర్ గా పని చేస్తున్నాడు. మాకు ఐదుగురు ఆడపిల్లలు. ఇద్దరు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేశాం. నా భర్త తిరిగి వస్తేనే వస్తేనే కుటుంబాన్ని పోషించుకుకోగలం అని బీహార్ కుచెందిన సనాపతి అంటోంది. పాశమైలారం ఘటనలో ఎంత మంది చనిపోయిన విషయం ఇంకా తేలకపోవడం ఆర్తనాదాలు కూడా ఆగడం లేదు.

Read More
Next Story