పొలిటికల్ సర్కిల్స్ టాక్:  సుదర్శన్ రెడ్డికి తొందర్లో మంత్రి పదవి
x

పొలిటికల్ సర్కిల్స్ టాక్: సుదర్శన్ రెడ్డికి తొందర్లో మంత్రి పదవి

ఇప్పటి వరకు నాలుగు సార్లు శాసనసభ్యుడయ్యారు. రేవంత్ కు బాగా సన్నిహితుడు, మరెందుకు మంత్రి పదవి రాలేదు, వివరాలు


వెంకట్

గతంలో ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసి మరో నేతను ముఖ్యమంత్రి పదవి అనే గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో రెండు సార్లు మంత్రి పదవి రుచి చూసారు. అజమాషి చేయడంలో సంతృప్తి పొందిన ఆయన మరో సారి మంత్రి పదవి సాధించాలని, అది కూడ కీలకమైన హోంశాఖ సాధించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయన ఎవరో కాదు. నిజామాబాద్ జిల్లా బోధన్ శాసనసభ్యుడు పి సుదర్శన్ రెడ్డి.

ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయనకు బలమైన మద్దతుదారుడుగా నిలిచారు. ఏ రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఏ రేవంత్ రెడ్డి టీపీసీసీ సారధ్య బాధ్యతలు స్వీకరించిన తరువాత టీపీసీసీ కోశాధికారిగా నియమితులయ్యారు.
ఇటీవలి శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం మొదటి విడత మంత్రి పదవులు దక్కే వారి జాబితాలో సుదర్శన్ రెడ్డి పేరు ఉంటుందని అందరూ భావించారు. అయితే పార్టీ అధిష్టానం సుదర్శన్ రెడ్డి పేరును స్పీకర్ గా నిర్ణయించింది. స్పీకర్ పదవి స్వీకరించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటువంటి తరుణంలో ఆయనకు మొదటి విడతలో మంత్రి వర్గంలో చోటు కోల్పోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఇంకా ఆరుగురికి స్థానం లభించే అవకాశం ఉంది. రెండో విడతలో ఆయనకు ఖచ్చితంగామంత్రి పదవి వస్తుంది అని ఖరారైంది. అందులో కూడ ఆయన కోరుకున్న మంత్రి పదవే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం బోధన్ లో జరిగిన సమావేశంలో ఎంఎల్ సి జీవన్ రెడ్డి మట్లాడుతూ బోధన్ ప్రజలు సుదర్శన్ రెడ్డి కి అదృష్టం పట్టేవిధంగా చేశారని అన్నారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రెండో విడతకు సంబంధించి అధిష్టానం నుంచి అనుమతి పొందరని పార్లమెంట్ ఎన్నికల తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందులో సుదర్శన్ రెడ్డికి చోటు లభిస్తుందని అన్నారు.
ఇక బోధన్ సమస్యలన్నీ పరిష్కారం అయినట్టేనని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి కూడ పార్లమెంట్ ఎన్నికల విస్తరణ తరువాత ఉంటుందని తనకు సమాచారం ఉందని తెలియజేశారు. కాగా శాసనసభ్యుడుగా ఎన్నికైన నాటి నుంచి తన రాజకీయ ప్రత్యర్ధి అయిన షకీల్ అమీర్ పై దాదాపుగా అప్రకటిత యుధ్దం ప్రకటించారు.
బోధన్ లోనూ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు తమకు అనుకూలంగా వినియోగించుకుని కోట్ల రూపాయలు స్వాహా చేసిన వ్యవహారంపై మొత్తం కథను వెలుగు లోకి తీసుకువచ్చారు. అనేక మందిపై కేసులు నమోదు చేశారు. భోదన్ మాజీ శాసనసభ్యుడు షకీల్ కుమారుడు హైదరాబాద్ లో అప్పటి ప్రగతి భవన్ ప్రస్తుత ప్రజాభవన్ వద్ద బారిగేట్లను తన వాహనంతో గేట్లను ఢీకొట్టిన కేసులో పోలీసులు కఠినంగా వ్యవహరించడం వెనక సుదర్శన్ రెడ్డి హస్తమే ఉందని అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.
షకీల్ ఆయన కుమారుడు కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించగా ఇప్పటికే పంజగుట్ట సీఐతోపాటు బోధన్ సీఐని ఇతర సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారితో పాటు మరికొందరని అరెస్టు చేశారు. పంజగుట్టు పోలీసు స్టేషన్ లో మొత్తం 84 మంది వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. మాజీ శాసనభ్యుడితోపాటు ఆయన కుమారుడుపై కేసులు నమోదు చేసారు. తండ్రికొడుకులు ఇద్దరు గల్ఫ్ దేశాలకు వెళ్ళారని తెలుసుకుని పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు.
అయితే షకీల్ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారని సమాచారం. అయితే సుదర్శన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఇంత హడావిడి సృష్టించగా ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఎంత కఠినంగా బాధ్యతలు నిర్వర్తిస్తారో ఊహించుకోవచ్చునని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉండగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ గత కొన్ని రోజుల నుంచి నగరంలో రాతి పూట నగరంలో పర్యటిస్తూ అల్లరి చిల్లరగా బైకులపై తిరిగే యువకులకు క్లాస్ తీసుకుంటు ఉండగా దీనిని సుదర్శన్ రెడ్డి సమర్ధిస్తూ ఇటువంటి చర్యలు గట్టిగా తీసుకోవాలని అంటున్నారు. ఇది విన్న కాంగ్రెస్ నేతలు ఇక నుంచి తమ పద్దతి మార్చుకోవడం అనివార్యం అని వ్యాఖ్యానించారు.హోం, శాంతి భద్రతల నిర్వహణ శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే ఆ శాఖలు సుదర్శన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తన రాజకీయ యాత్ర సందర్భంగా నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతు సుదర్శన్ రెడ్డి సాధించే డబ్బుకు బర్ కత్ ఉంటుందని ఏ పని చేపట్టిన సక్సెస్ అవుతుందని అన్నారు. అందువల్లే టీపీసీసీ లో ఆయన కోశాధికారి భాద్యతలు నిర్వర్తిస్తున్నారని తెలియజేశారు. కాగా బరకత్ లీడర్ కు ఖుషి ఖబర్ ఎప్పుడో మరి..


Read More
Next Story